సీజేఐకి క్లీన్ చిట్
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టీస్ రంజన్ గోగోయ్ పై మాజీ ఉద్యోగిని చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలు అబద్ధమని ముగ్గురు జడ్జిల విచారణ ప్యానల్ స్పష్టం [more]
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టీస్ రంజన్ గోగోయ్ పై మాజీ ఉద్యోగిని చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలు అబద్ధమని ముగ్గురు జడ్జిల విచారణ ప్యానల్ స్పష్టం [more]
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టీస్ రంజన్ గోగోయ్ పై మాజీ ఉద్యోగిని చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలు అబద్ధమని ముగ్గురు జడ్జిల విచారణ ప్యానల్ స్పష్టం చేసింది. ఈ ఆరోపణల వ్యవహారంలో చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ కు క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ ఆరోపణల వ్యవహారంలో ముగ్గురు జడ్జిలతో సుప్రీం కోర్టు అంతర్గత విచారణ జరిపించింది. విచారణ జరిపిన తర్వాత సదరు ఉద్యోగిని చేసిన ఆరోపణల్లో నిజం లేదని తేలింది. కాగా, ఏకంగా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిపైనే ఈ ఆరోపణలు రావడం ఇటీవల సంచలనం సృష్టించింది. ఈ ఆరోపణల వెనుక కుట్ర ఉందని, కొన్ని కోట్ల రూపాయలు చేతులు మారాయని ఓ అడ్వకేట్ సైతం సుప్రీం కోర్టు దృష్టికి తీసుకువచ్చిన విషయం తెలిసిందే.