వరవరరావు ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరం
మహారాష్ట్ర జైల్లో ఉన్న వరవరరావు ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ఆయన కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. వరవరరావు భార్య హేమలత నిన్న ఆయనతో మాట్లాడారు. అయితే ఆయన [more]
మహారాష్ట్ర జైల్లో ఉన్న వరవరరావు ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ఆయన కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. వరవరరావు భార్య హేమలత నిన్న ఆయనతో మాట్లాడారు. అయితే ఆయన [more]
మహారాష్ట్ర జైల్లో ఉన్న వరవరరావు ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ఆయన కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. వరవరరావు భార్య హేమలత నిన్న ఆయనతో మాట్లాడారు. అయితే ఆయన పొంతన లేకుండా మాట్లాడుతుండటాన్ని గమనించిన హేమలత వరవరరావును వెంటనే ఆసుపత్రిలో చేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. బెయిల్ కూడా ఇవ్వడం లేదని, వరవరరావు ఆరోగ్యం బాగాలేదన్నారు. ఎప్పుడో చనిపోయిన తన తల్లిదండ్రులు ఇప్పుడు చనిపోయారంటూ వరవరరావు మాట్లాడుతుండటాన్ని బట్టి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. వీరితో పాటు ప్రొఫెసర్ హరగోపాల్ సయితం ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేఖ రాశారు. వరవరరావును ఆసుపత్రిలో చేర్పించేలా మహారాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడాలని హరగోపాల్ కోరారు.