Sat Nov 23 2024 08:41:56 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : గానకోకిల లతామంగేష్కర్ మృతి
ప్రముఖ గాయని లతా మంగేష్కర్ మృతి చెందారు. కరోనా బారిన పడిన ఆమె కొద్దికాలంగా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.
ప్రముఖ గాయని లతా మంగేష్కర్ మృతి చెందారు. కరోనా బారిన పడిన ఆమె కొద్దికాలంగా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. నిన్న ఆరోగ్యం విషమించడంతో లతా మంగేష్కర్ ను ఐసీయూలోకి తరలించినట్లు వైద్యులు తెలిపారు. కేంద్ర మంత్రి పియూష్ గోయల్ సయితం ఆమెను పరామర్శించి వచ్చారు. కొద్ది సేపటి క్రితం ముంబయిలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. 1929 లో లతామంగేష్కర్ జన్మించారు. ప్రముఖ గాయని ఆశాభోంస్లే ఆమె సోదరి.
గత నెల 8న....
గత నెల 8వ తేదీన కరోనా లక్షణాలతో లతా మంగేష్కర్ ఆసుపత్రిలో చేరారు. అప్పటి నుంచి ఆమె చికిత్స పొందుతున్నారు. కొద్దిగా కోలుకోవడంతో ఆమెను ఐసీయూ నుంచి సాధారణ వార్డుకు తరలించారు. 92 ఏళ్ల లతామంగేష్కర్ గాయనిగా పద్మ భూషణ్, పద్మవిభూషణ్ తో పాటు అనేక అవార్డులు, రివార్డులు అందుకున్నారు. 1942 లో 13 ఏళ్ల వయసులోనే ఆమె తొలి పాట పాడారు. భారత నైటింగేల్ గా ఆమె పేరు పొందారు. గానకోకిల గా పేరు పొందిన లతా మంగేష్కర్ మృతితో బాలీవుడ్ తో పాటు దేశం మొత్తం శోక సంద్రంలో మునిగిపోయింది.
Next Story