కూతురి మరణాన్ని తట్టుకోలేక…తాను కూడా?
యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆరేళ్ల చిన్నారి ఆద్య కుటుంబంలో మరొక విషాదం చోటు చేసుకుంది.. కన్న కూతురు చనిపోయిందన్న మనోవేదనతో మానసికంగా కుంగి పోయి ఒక తండ్రి [more]
యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆరేళ్ల చిన్నారి ఆద్య కుటుంబంలో మరొక విషాదం చోటు చేసుకుంది.. కన్న కూతురు చనిపోయిందన్న మనోవేదనతో మానసికంగా కుంగి పోయి ఒక తండ్రి [more]
యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆరేళ్ల చిన్నారి ఆద్య కుటుంబంలో మరొక విషాదం చోటు చేసుకుంది.. కన్న కూతురు చనిపోయిందన్న మనోవేదనతో మానసికంగా కుంగి పోయి ఒక తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. యాదాద్రి భువనగిరి జిల్లాలో గత వారం రోజుల క్రితం ఘట్కేసర్ కు చెందిన మహిళ అక్రమ సంబంధం కారణంగా చిన్నారి ఆద్య హత్య జరిగింది. ఆ మహిళ ప్రియుడు కరుణాకర్ మహిళ ఇంటికి వచ్చినప్పుడు మహిళా వేరొకరితో గడుపుతున్న దృశ్యాన్ని చూసి ఆవేశంతో అక్కడి ఆడుకుంటున్న మహిళ కూతురు బేబీ ఆద్య ను గొంతు కోసి అతి కిరాతకంగా హత్య చేశాడు. అయితే వారం రోజుల క్రితం జరిగిన ఈ సంఘటనలో తండ్రి కళ్యాణ్ కూతురు మరణాన్ని తట్టుకోలేక పోయాడు. ఆద్య చనిపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. తండ్రి కళ్యాణ్ రైలు కింద తల పెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు. భువనగిరి రైల్వే ట్రాక్ పై అతని మృతదేహం లభ్యమైంది. విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
- Tags
- adya
- à°à°¦à±à°¯