ఈఎస్ఐ స్కాంలో ఏసీబీ దూకుడు……4.5 కోట్లు సీజ్
తెలంగాణ ఈఎస్ఐ స్కాంలో తవ్విన కొద్ది అక్రమాలు వెలుగు చూస్తున్నాయి ఈ స్కామ్ లో కొత్తగా నాలుగు కోట్ల 40 లక్షల రూపాయల నగదు ఏసీబీ అధికారులు [more]
తెలంగాణ ఈఎస్ఐ స్కాంలో తవ్విన కొద్ది అక్రమాలు వెలుగు చూస్తున్నాయి ఈ స్కామ్ లో కొత్తగా నాలుగు కోట్ల 40 లక్షల రూపాయల నగదు ఏసీబీ అధికారులు [more]
తెలంగాణ ఈఎస్ఐ స్కాంలో తవ్విన కొద్ది అక్రమాలు వెలుగు చూస్తున్నాయి ఈ స్కామ్ లో కొత్తగా నాలుగు కోట్ల 40 లక్షల రూపాయల నగదు ఏసీబీ అధికారులు సీజ్ చేశారు మరోవైపు ఈ ఎస్ ఐ మాజీ డైరెక్టర్ దేవికారాణి తో పాటు డాక్టర్ నాగమణి పైన ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించి సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే నివాస స్థలాన్ని కొనుగోలు చేసేందుకు దేవికారాణి 3 కోట్ల 37 లక్షల రూపాయలు బిల్డర్ కు ఇవ్వడం జరిగింది. అదే మాదిరిగా నాగమణి కూడా బిల్డర్ కు 72 లక్షల రూపాయలను ఇచ్చారు. అయితే ఇటీవల కాలంలో విచారణ సమయంలో నాలుగు కోట్ల 40 లక్షల రూపాయలు ఒక బిల్డర్ కు ఇచ్చినట్లుగా ఏసీబీ అధికారులు కనుక్కున్నారు. దీంతో వెంటనే బిల్డర్ ఇంట్లో సోదాలు చేసినప్పుడు ఈ డబ్బు మొత్తం దొరికింది. నాలుగు కోట్ల 40 లక్షల రూపాయల నగదు ఏసీబీ అధికారులు సీజ్ చేశారు. సీజ్ చేసిన నగదు మొత్తం కోర్టు లో డిపాజిట్ చేస్తామని అధికారులు వెల్లడించారు. మరోవైపు బిల్డర్ ను ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. తమకు కొన్నాళ్ళ క్రితం ఒక నివాస స్థలం కొనుగోలుకు సంబంధించి ఈ నగదు ఇచ్చారని బిల్డర్ వెల్లడించారు. దేవికారాణి కి. సంబంధించిన నగదు దొరకడం తోటే కేసులో మరింత లోతుగా విచారణ చేస్తున్నామని అధికారులు వెల్లడించారు..