Mon Dec 23 2024 14:27:10 GMT+0000 (Coordinated Universal Time)
వచ్చే 25 ఏళ్ల ను దృష్టిలో పెట్టుకుని బడ్జెట్
కరోనా సంక్షోభ సమయంలోనూ బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు
కరోనా సంక్షోభ సమయంలోనూ బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. వచ్చే ఐదేళ్లలో అరవై లక్షల ఉద్యోగాల కల్పన ధ్యేయమని తెలిపారు. 2021-2022 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ను నిర్మలా సీతారామన్ లోక్ సభలో ప్రవేశ పెట్టారు. దేశంలో వ్యాక్సినేషన్ వేగంగా కొనసాగుతుందని చెప్పారు. పేద, మధ్యతరగతి ప్రజల సాధికారికత కోసం ప్రభుత్వం ప్రయత్నిస్తుందని చెప్పారు. ఆర్థికాభివృద్థి కొనసాగాలే బడ్జెట్ రూపకల్పన చేశామని చెప్పారు. మొదటి ప్రధాన అంశంగా పీఎం గతి శక్తి పథకాన్ని తీసుకున్నామని చెప్పారు.
హైవే నెట్ వర్క్.....
దేశంలో వ్యాక్సినేషన్ వేగంగా జరుగుతుందని చెప్పారు. వచ్చే 25 ఏళ్ల పురోగతిని దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ ను రూపకల్పన చేశామని నిర్మలా సీతారామన్ చెప్పారు. వృద్ధి రేటు లక్ష్యం 9.2 శాతం అంచనాగా ఉందన్నారు. ప్రభుత్వ సంస్థల ప్రయివేటీకరణ వేగంగా జరుగుతుందని తెలిపారు. నేషనల్ హైవే నెట్ వర్క్ ను 25 వేల కిలోమీటర్లకు పెంచుతున్నామని, ఇందుకు ఇరవై వేల కోట్లను సమీకరిస్తున్నామని తెలిపారు. ఆత్మనిర్భర్ భారత్ తో 16 లక్షల ఉద్యోగాలను సృష్టించుకోగలిగామని నిర్మలా సీతారామన్ తెలిపారు. దేశంలో 75 వేల కిలోమీటర్ల హైవేల నిర్మాణం లక్ష్యమని ఆమె తెలిపారు.
పర్వత ప్రాంతాలను కలుపుతూ....
దేశంలోని పర్వత ప్రాంతాలను కలిపే విధంగా పీపీపీ పద్ధతిలో పర్వత మాల కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. విద్యుత్, వంట గ్యాస్ ప్రతి ఇంటికి చేరేలా చూశామని చెప్పారు. పేదలకు మౌలిక సదుపాయాల కల్పనే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆమె వివరించారు. దేశంలో నాలుగు మల్లీ మోడల్ పార్కులను ఏర్పాటు చేస్తున్నామని చేస్తున్నామని చెప్పారు. దేశంలో నదుల అనుసంధానానికి కృషి చేస్తుందని ఆమె చెప్పారు. వచ్చే మూడేళ్లలో వందే భారత్ పేరిటి నాలుగువేల కొత్త రైళ్లను వేస్తున్నామని చెప్పారు.
Next Story