Fri Dec 20 2024 10:15:14 GMT+0000 (Coordinated Universal Time)
సూర్య బాదితేనే నేటి మ్యాచ్ లో విజయం
నేడు భారత్ - న్యూజిలాండ్ ల మధ్య తొలి టీ 20 మ్యాచ్ జరగబోతుంది
నేడు భారత్ - న్యూజిలాండ్ ల మధ్య తొలి టీ 20 మ్యాచ్ జరగబోతుంది. వన్డేల్లో ఇప్పటికే శ్రీలంక, న్యూజిలాండ్ లను క్లీన్ స్వీప్ చేసిన భారత్ జట్టు టీ 20 సిరీస్ ను కూడా సొంతం చేసుకోవాలని చూస్తుంది. ఈ ఫార్మాట్ లోనూ రాణించి భారత్ తన సత్తా చాటాలనుకుంటుంది. రాంచీలో ఈ మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది. ఇప్పటికే ఇరు జట్లు రాంచీ చేరుకుని ముమ్మరంగా ప్రాక్టీస్ చేశాయి.
జట్టులో యువ ఆటగాళ్లే...
హార్థిక్ పటేల్ నేతృత్వంలో ఈ జట్టు సిరీస్ ను సొంతం చేసుకుంటుందని భారత్ అభిమానులు భావిస్తున్నారు. ప్రధానంగా సూర్యకుమార్ పైనే ఆశలు పెట్టుకున్నారు. సూర్యకుమార్ అత్యధిక స్కోరు చేస్తేనే భారత్ జట్టు గెలుపు అవకాశాలుంటాయి. అయితే ఈ గ్రౌండ్ జరిగిన మూడు ఇంటర్నేషనల్ మ్యాచ్ లలోనూ భారత్ గెలిచింది. యువ ఆటగాళ్లే ఈ జట్టులో ఉందనున్నారు. రోహిత్ శర్మ, విరాట్ కొహ్లి, కేఎల్ రాహుల్, షమి, సిరాజ్ లకు విశ్రాంతి నిచ్చారు. కివీస్ ఈ సిరీస్ ను అయినా పరాయి గడ్డపై సొంతం చేసుకోవాలని శ్రమిస్తుంది. భారత్ అభిమానులు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.
- Tags
- india
- new zealand
Next Story