బ్రేకింగ్ : ఐదు రాష్ట్రాల ఎన్నికల షేడ్యూల్ విడుదల
ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. శనివారం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఓ.పి.రావత్ తెలంగాణతో పాటు మధ్య ప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్ ఘడ్, మిజోరం రాష్ట్రాలకు షెడ్యూల్ ను విడుదల చేశారు. చత్తీస్ ఘడ్ తప్ప మిగతా అన్ని రాష్ట్రాల్లో ఒకే ఫేజ్ లో ఎన్నికలు జరగనున్నాయి.
చత్తీస్ ఘడ్ లో...
నక్సలైట్ల ప్రాబల్యం ఉన్న చత్తీస్ ఘడ్ లోని 18 నియోజకవర్గాలకు మొదటి దశలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 16న నోటిఫికేషన్ రానుండగా నవంబర్ 12న ఎన్నికలు జరగనున్నాయి. ఇక రెండో దశలో చత్తీస్ ఘడ్ లోని 72 నియోజకవర్గాలకు ఆక్టోబర్ 26న నోటిఫికేషన్ రానుండగా నవంబర్ 20న పోలింగ్ జరగనుంది.
మధ్యప్రదేశ్, మిజోరంలో...
మధ్య ప్రదేశ్, మిజోరంలో నవంబర్ 13న ఎన్నికల నోటిఫికేషన్ రానుంది. నవంబర్ 28న ఎన్నికలు జరగనున్నాయి.
రాజస్థాన్, తెలంగాణలో...
రాజస్థాన్, తెలంగాణలో నవంబర్ 12న ఎన్నికల నోటిఫికేషన్, 19న నామినేషన్లకు తుది గడువు, డిసెంబర్ 7న ఎన్నికలు జరగనున్నాయి.
- ఎన్నికలు జరిగిన అన్ని రాష్ట్రాల్లో కౌంటింగ్ డిసెంబర్ 11న జరగనుంది.