జగన్ కు చిరు అభినందన
ఆంధ్రప్రదేశ్ దిశా చట్టం- 2019 పేరుతో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అభినందనీయమని మాజీ కేంద్రమంత్రి సినీనటుడు చిరంజీవి ఒక ప్రకటన విడుదల చేశారు. ముఖ్యంగా మహిళా సోదరీమణులకు, [more]
ఆంధ్రప్రదేశ్ దిశా చట్టం- 2019 పేరుతో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అభినందనీయమని మాజీ కేంద్రమంత్రి సినీనటుడు చిరంజీవి ఒక ప్రకటన విడుదల చేశారు. ముఖ్యంగా మహిళా సోదరీమణులకు, [more]
ఆంధ్రప్రదేశ్ దిశా చట్టం- 2019 పేరుతో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అభినందనీయమని మాజీ కేంద్రమంత్రి సినీనటుడు చిరంజీవి ఒక ప్రకటన విడుదల చేశారు. ముఖ్యంగా మహిళా సోదరీమణులకు, లైంగిక వేధింపులకు గురవుతోన్న చిన్నారులకు ఈ చట్టం భరోసా, భద్రత ఇస్తుందన్న ఆశ తనలో ఉందని చిరంజీవి అన్నారు. దిశ సంఘటన అందర్నీ కలిచివేసిందని, ఆ ఎమోషన్స్ తక్షణ న్యాయాన్ని డిమాండ్ చేశాయన్నారు. తక్షణ న్యాయం కంటే సత్వర న్యాయం మరింత సత్ఫలితాల్ని ఇస్తాయన్న నమ్మకం అందరిలో ఉందన్నారను. అందుకే అలాంటి సత్వర న్యాయం కోసం ఆంధ్రప్రదేశ్ లో తొలి అడుగులు పడడం హర్షణీయమన్నారు.
21 రోజుల్లో….
సీఆర్పీసీ ని సవరించడం ద్వారా 4 నెలలు అంతకంటే ఎక్కువ పట్టే విచారణా సమయాన్ని 21 రోజులకు కుదించడం, ప్రత్యేక కోర్టులు ఇతర మౌలిక సదుపాయాల్ని కల్పించడంతో పాటు ఐపీసీ ద్వారా సోషల్ మీడియా ద్వారా మహిళల గౌరవాన్ని కించపరచడం లాంటివి చేస్తే తీవ్రమైన శిక్షలు, చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడితే జీవిత ఖైదు విధించడం ద్వారా నేరాలోచన ఉన్న వాళ్లలో భయం కల్పించే విధంగా చట్టాలు తేవడాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చిరంజీవి పేర్కొన్నారు. ఈ చర్యలతో మహిళా లోకం నిర్భయంగా, స్వేచ్ఛగా ఉండగలుగుతుందన్న నమ్మకం తనకు ఉందని తెలిపారు.