Thu Jan 16 2025 11:11:00 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : ఈడి ఎదుటకు గాలి
హైదరాబాదులోని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఎదుట మాజీ మంత్రి, గనుల కింగ్ గాలి జనార్దన్ రెడ్డి హాజరయ్యారు. 2007లో గాలి జనార్థన్ రెడ్డి పై సిబిఐ [more]
హైదరాబాదులోని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఎదుట మాజీ మంత్రి, గనుల కింగ్ గాలి జనార్దన్ రెడ్డి హాజరయ్యారు. 2007లో గాలి జనార్థన్ రెడ్డి పై సిబిఐ [more]
హైదరాబాదులోని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఎదుట మాజీ మంత్రి, గనుల కింగ్ గాలి జనార్దన్ రెడ్డి హాజరయ్యారు. 2007లో గాలి జనార్థన్ రెడ్డి పై సిబిఐ కేసు నమోదు చేసింది. గాలి జనార్దన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రాజగోపాల్, సబిత ఇంద్రారెడ్డి లపై సీబీఐ అభియోగాలు మోపింది. అసోసియేటెడ్ మైనింగ్ కంపెనీ యజమాని గాలి జనార్దన్ రెడ్డి ఆయన భార్య లక్ష్మి అరుణలకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఫెమా చట్టాలను ఉల్లంఘించి భారీగా మనీలాండరింగ్ పాల్పడినట్లు అభియోగాలు నమోదు చేసింది. ఈడీ ఎదుట హాజరైన గాలి జనార్థన్ రెడ్డి పై గతంలో 120, 421, 4 11, 471 యాక్ట్ కింద కేసులు నమోదు అయ్యాయి.తొలిసారి గాలి జనార్థన్ రెడ్డి ఈడీ ఎదుట హాజరయ్యారు.
Next Story