Thu Dec 19 2024 11:55:07 GMT+0000 (Coordinated Universal Time)
ప్రభావం చూపుతున్న ఫార్వర్డ్ బ్లాక్
నవంబర్ 30 న జరుగబోయే తెలంగాణ శాసన సభ ఎన్నికల్లో ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అభ్యర్థులు సింహం గుర్తుతో చాలా స్థానాల్లో గట్టి పోటీ ఇస్తున్నారు. రాజకీయంగా అన్యాయానికి గురైన వారికి నేతాజీ స్థాపించిన ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చి ప్రోత్సహించింది.
కొన్ని స్థానాల్లో గెలుపు దిశగా... కొన్ని స్థానాల్లో ప్రధాన పార్టీల గెలుపు, ఓటముల ప్రభావితం
నవంబర్ 30 న జరుగబోయే తెలంగాణ శాసన సభ ఎన్నికల్లో ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అభ్యర్థులు సింహం గుర్తుతో చాలా స్థానాల్లో గట్టి పోటీ ఇస్తున్నారు. రాజకీయంగా అన్యాయానికి గురైన వారికి నేతాజీ స్థాపించిన ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చి ప్రోత్సహించింది.
మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు (కొత్తగూడెం), చెరుకు రైతులు, గల్ఫ్ కార్మికులు, బీడీ కార్మికులు బలపరిచిన చెన్నమనేని శ్రీనివాస్ రావు (కోరుట్ల), పి. విష్ణువర్ధన్ రెడ్డి (షాద్ నగర్), తెలంగాణ ఉద్యమకారుడు మున్నూరు రవి (మహబూబ్ నగర్), గొంగల్ల రంజిత్ కుమార్ (గద్వాల్), పిల్లుట్ల రఘు (హుజూర్ నగర్), పిల్లి రామరాజు యాదవ్ (నల్గొండ), డా. ఎం. అంజి యాదవ్ (కోదాడ), బద్దం భోజారెడ్డి (ముధోల్) తొమ్మిది మంది గట్టి పోటీ ఇస్తున్నారు.
ఫార్వర్డ్ బ్లాక్ టికెట్ పై సింహం గుర్తుతో పోటీ చేస్తున్న గల్ఫ్ సంఘాల నాయకులు గుగ్గిల్ల రవిగౌడ్ (వేములవాడ), స్వదేశ్ పరికిపండ్ల (నిర్మల్), బూత్కూరి కాంత (ధర్మపురి), బూస రాకేష్ యాదవ్ (ఆర్మూర్) లతో పాటు సిరిసిల్లలో ఇండిపెండెంటుగా టీవీ రిమోట్ గుర్తుపై పోటీ చేస్తున్న గల్ఫ్ కార్మిక ఉద్యమకారుడు క్రిష్ణ దొనికెని ప్రధాన పార్టీల అభ్యర్థుల గెలుపు, ఓటములను ప్రభావితం చేయనున్నారు.
Next Story