ఫ్రిజ్ పేలి యువతి మృతి
వంటింట్లోని ఎల్పీజీ సిలిండర్లే కాదు.. ఫ్రిజ్‌లు కూడా పేలుతున్నాయి. కూల్‌గా ఉండే ఫ్రిజ్.. మంటలను వెదజల్లగలదు. బాంబులా పేలి ప్రాణాలు తీయగలదు. తాజాగా హైదరాబాద్ శివారులోని బొంగులూరులో [more]
వంటింట్లోని ఎల్పీజీ సిలిండర్లే కాదు.. ఫ్రిజ్‌లు కూడా పేలుతున్నాయి. కూల్‌గా ఉండే ఫ్రిజ్.. మంటలను వెదజల్లగలదు. బాంబులా పేలి ప్రాణాలు తీయగలదు. తాజాగా హైదరాబాద్ శివారులోని బొంగులూరులో [more]
వంటింట్లోని ఎల్పీజీ సిలిండర్లే కాదు.. ఫ్రిజ్‌లు కూడా పేలుతున్నాయి. కూల్‌గా ఉండే ఫ్రిజ్.. మంటలను వెదజల్లగలదు. బాంబులా పేలి ప్రాణాలు తీయగలదు. తాజాగా హైదరాబాద్ శివారులోని బొంగులూరులో ఇలాంటి ఘటనే జరిగింది. ఇంట్లోని ఫ్రిజ్ పేలి 18 ఏళ్ల యువతి చనిపోయింది. భారీగా మంటలు చెలరేగడంతో అక్కడికక్కడే చనిపోయింది. ఈ ఘటన స్థానికంగా విషాదం నింపంది.
నీళ్ల కోసం ఫ్రిజ్ ఓపెన్ చేయడంతో…
నల్గొండ జిల్లా దేవరకొండకు చెందిన కొప్పుల మనోహర్ – లావణ్య దంపతులు ఐదేళ్లుగా బొంగులూరులో నివాసం ఉంటున్నారు. వీరి కుమార్తె దీపిక(19) బీటెక్ మొదటి సంవత్సరం చదువుతోంది. సెమిస్టర్ పరీక్షల నేపథ్యంలో ఇంట్లోనే ఉండి చదువుకుంటోంది దీపిక. గురువారం ఉదయం తల్లిదండ్రులు విధులకు, సోదరి స్కూల్‌కు వెళ్లడంతో.. ఇంట్లో గడియపెట్టుకుంది. మధ్యాహ్నం సమయంలో దాహం వేడయంతో నీళ్లు తాగేందుకు ఫ్రిజ్ డోర్ ఓపెన్ చేసింది. వెంటనే కంప్రెషర్ పేలిపోయి మంటలు చెలరేగాయి. దీపికకు మంటలు అంటుకోవడంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. ఇళ్లు మొత్తం మంటలు అంటుకుని వస్తువులన్నీ కాలిపోయాయి. ఈ ఘటనతో దీపిక తల్లితండ్రులు, బంధువులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు.