Tue Nov 26 2024 11:30:32 GMT+0000 (Coordinated Universal Time)
గాలి గాయబ్....పోలీసుల గాలింపు
మైనింగ్ గాలి జనార్థన్ రెడ్డి పరారీలో ఉన్నారు. ఆయనకోసం పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. అబెండెంట్ కంపెనీ తరుపున ఈడీ అధికారికి కోటి రూపాయలు లంచం ఇచ్చిన కేసులో గాలిని పోలీసులు అరెస్ట్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఇది తెలుసుకున్న గాలి పరారీలో ఉన్నారు. అబెండెంట్ కంపెనీని ఈడీ నుంచి కాపాడేందుకు గాలి జనార్థన్ రెడ్డి డీల్ కుదుర్చుకున్నారని, ఈ మేరకు కోటి రూపాయలు లంచాన్ని ఈడీ అధికారులకు ఇచ్చారని, అందుకు ప్రతిఫలంగా గాలికి అబెండెంట్ కంపెనీ 57 కిలోల బంగారం కడ్డీలను ఇచ్చిందని ఆరోపణలు ఉన్నాయి. మొత్తం మీద గాలి మరో కేసులో ఇరుక్కున్నట్లే కన్పిస్తుంది.
Next Story