Mon Dec 23 2024 17:39:12 GMT+0000 (Coordinated Universal Time)
బళ్లారిలో ఎదురు "గాలి"
గాలి జనార్థన్ రెడ్డి కుటుంబానికి బళ్లారి ప్రాంతంలో పట్టుంది. కానీ ఫలితాల్లో మాత్రం వెనుకంజలో ఉంది.
గాలి జనార్థన్ రెడ్డి కుటుంబానికి బళ్లారి ప్రాంతంలో పట్టుంది. అయితే ప్రస్తుతం వస్తున్న ఫలితాల ప్రకారం గాలి జనార్థన్ కుటుంబ సభ్యులు కూడా వెనుకంజలో ఉన్నారు. గాలి జనార్థన్ రెడ్డి భార్య కూడా వెనుకంజలో ఉన్నారు. గాలి జనార్థన్ రెడ్డి ప్రత్యేకంగా పార్టీ ఏర్పాటు చేసుకుని దాదాపు నలభై ఐదు స్థానాల్లో తన అభ్యర్థులను బరిలోకి దింపారు. కల్యాణ రాజ్య ప్రగతి పక్ష అని పార్టీ పేరు పెట్టి తన అభ్యర్థులను బరిలోకి దించారు.
వెనుకంజలో...
అయితే గాలి అరుణ లక్ష్మి వెనుకంజలో ఉన్నారు. అంటే బళ్లారి ప్రాంత ప్రజలు కూడా గాలి జనార్థన్ రెడ్డి కుటుంబాన్ని ఆదరించలేదని చెప్పాల్సి ఉంటుంది. గాలి జనార్థన్ రెడ్డి బీజేపీ నుంచి బయటకు వచ్చి ప్రత్యేకంగా పార్టీ పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగారు. అయినా ప్రజలు మాత్రం బీజేపీ, కాంగ్రెస్ వైపు మాత్రమే చూశారు తప్పించి గాలి కుటుంబాన్ని మాత్రం బళ్లారిలోనూ పట్టించుకోలేదని ఎర్లీ రిజల్ట్ను బట్టి అర్ధమవుతుంది.
Next Story