Thu Jan 16 2025 07:56:03 GMT+0000 (Coordinated Universal Time)
ధర్నాచౌక్ కాదు... గాంధీ భవన్..!
కాంగ్రెస్ పార్టీలో పొత్తు, టిక్కెట్ల లొల్లి తారస్థాయికి చేరింది. తమకు టిక్కెట్ దక్కడం లేదని తెలుసుకుంటున్న వివిధ నియోజకవర్గాలకు చెందిన ఆశావహులు పెద్దఎత్తున అనుచరులతో గాంధీ భవన్ కు తరలివస్తున్నారు. గాంధీ భవన్ మెట్లపై కూర్చుని ధర్నాలు చేస్తున్నారు. ఇవాళ ఉప్పల్, నకిరేకల్, ఖానాపూర్ నియోజకవర్గాల నేతలు గాంధీ భవన్ కు వచ్చారు.
ఆందోళనలు ఉధృతం.....
ఉప్పల్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీకే కేటాయించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ నేత రాగిడి లక్ష్మారెడ్డి, ఆయన అనుచరులు ధర్నాకు దిగారు. నకిరేకల్ స్థానాన్ని తనకే కేటాయించాలని ప్రసన్నరాజు తన అనుచరులతో కలిసి ఆందోళనకు దిగారు. ఇక ఖానాపూర్ టిక్కెట్ ను ఇటీవలే పార్టీలో చేరిన రమేష్ రాథోడ్ కి ఇవ్వవద్దని హరినాయక్ వర్గీయులు ఆందోళన చేస్తున్నారు. మొత్తానికి గాంధీ భవన్ ధర్నాచౌక్ ని తలపిస్తోంది.
Next Story