Thu Jan 16 2025 13:45:04 GMT+0000 (Coordinated Universal Time)
గాంధీ భవన్ లో మొదలైన లొల్లి
మహాకూటమి సీట్ల సర్దుబాటు వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీలో లొల్లి మొదలైంది. పొత్తులో భాగంగా మల్కాజిగిరి స్థానాన్ని తెలంగాణ జన సమితి ఇస్తున్నట్లు నిన్న ప్రచారం జరిగింది. దీంతో ఈ స్థానాన్ని ఆశిస్తున్న కాంగ్రెస్ నేత నందికంటి శ్రీధర్ అనుచరులు శుక్రవారం ఉదయమే పెద్దసంఖ్యలో గాంధీ భవన్ చేరుకున్నారు. కార్యకర్తలంతా గేట్లు తెరిచి గాంధీ భవన్ లోపలికి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. మరోవైపు బీసీ సామాజికవర్గ నేతలు ఉన్న నియోజకవర్గాలను ఇతర పార్టీలకు కేటాయించడంతో తమకు అన్యాయం జరుగుతుందని బీసీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Next Story