లడ్డూ ప్రస్థానం ఇలా ….
గణేష్ నవరాత్రుల్లో వినాయకుని చేతిలో పెట్టిన లడ్డూకు చాలా క్రేజ్ పెరుగుతుంది. ఆ లడ్డూ కొనుగోలు చేస్తే కోరిన కోరికలు ఆ దేవ దేవుడు తీరుస్తారని కొందరు…. [more]
గణేష్ నవరాత్రుల్లో వినాయకుని చేతిలో పెట్టిన లడ్డూకు చాలా క్రేజ్ పెరుగుతుంది. ఆ లడ్డూ కొనుగోలు చేస్తే కోరిన కోరికలు ఆ దేవ దేవుడు తీరుస్తారని కొందరు…. [more]
గణేష్ నవరాత్రుల్లో వినాయకుని చేతిలో పెట్టిన లడ్డూకు చాలా క్రేజ్ పెరుగుతుంది. ఆ లడ్డూ కొనుగోలు చేస్తే కోరిన కోరికలు ఆ దేవ దేవుడు తీరుస్తారని కొందరు…. ఆ లడ్డూను పంటపోలాల్లో చల్లితే పంట బాగా వస్తుందని ఇంకొందరు… ఇలా అనేక మంది వివిధ అవసరాల కోసం లడ్డూ వేలంలో పాల్గొని ధర ఎంతైనా కైవసం చేసుకుంటున్నారు. ప్రతి ఏటా ఈ లడ్డూల ధరలు పెరుగుతూనే ఉన్నాయి.
ఇలా మొదలైంది….
లడ్డూ వేలం అనేది ప్రస్తుతం తెలంగాణలో హైలెట్ గా నిలుస్తోంది. పోటా పోటీగా నిర్వాహాకులు ప్రతి మండపంలోనూ లడ్డూను వేలం వేస్తున్నారు. ఇలా వచ్చిన డబ్బుతో కొందరు సమాజం కోసం సేవలు చేస్తున్నారు. కాలనీల్లో అభివృద్ధి కార్యక్రమాలు, ఆలయాల అభివృద్ధి, మరికొందరు వచ్చే ఏడాది జరిగే ఉత్సవాలకు ఈ డబ్బును ఖర్చుపెడుతుంటారు. అయితే లడ్డూ వేలం మాత్రం మొదటి సారిగా 1994లో బాలాపూర్ లోనే మొదలైందని చెబుతారు. ఆ నాడు మొదటి సారిగా 450 రూపాయలకు ఈ బాలాపూర్ లడ్డూ వేలంలో కొలను మోహన్ రెడ్డి అనే భక్తుడు దక్కించుకున్నారు. . వినాయకునికి చేతిలో పెట్టిన ఈ లడ్డూ నవరాత్రులు పూజలందుకోవడం వల్ల ఆ లడ్డూకు ప్రాముఖ్యత, విశిష్టత పెరుగుతుందని భక్తులు భావిస్తారు. అందుకే ఆ లడ్డూలకోసం ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా వేలంలో పాల్గొని పోటీ పడుతున్నారు.
ఎందుకంత ప్రాచుర్యం……
బాలాపూర్ లడ్డూ అంత ప్రాచుర్యం పొందటానికి కారణం ఇక్కడి లడ్డూను కొనుగోలు చేసి పొలాల్లో చల్లితే పంటలు బాగా పండుతాయనే నమ్మకం ఉండటం వలన వ్యవసాయదారులు లడ్డూను దక్కించుకునేందుకు పోటీపడుతారు. వారి నమ్డ్మకం నిజం కావడంతో ఈ ప్రచారం వల్ల ఏటా పోటీ పెరిగిపోతోంది. దీంతో బాలా పూర్ లడ్డూకు మంచి హైప్ వస్తోంది. వేలం మొదలైన 17 సంవత్సరాల వరకూ స్థానికులకే అవకశం కల్పించారు నిర్వాహాకులు. ఆ తర్వాత స్థానికేతరులకూ అవకాశం ఇస్తున్నారు. ఈ ఏడాది నెల్లూరు వాస్తవ్యులు కూడా పోటీలో పాలు పంచుకున్నారు.
నగరంలోని వివిధ ప్రాంతాల్లో …..
బాలాపూర్ లో మొదలైన లడ్డూవేలం ప్రస్థానం… క్రమక్రమంగా తెలంగాణ మొత్తం వ్యాపించింది. ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని వివిధ పేరొందిన మండపాల్లో లక్షలాది రూపాయలకు ఈ లడ్డూను భక్తులు కైవసం చేసుకుంటున్నారు.
రికార్డు లడ్డూ …..
2012 లో తాపేశ్వరం లో ఉన్న వినాయకుని లడ్డూ 6300 కి.గ్రా. లతో ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డు లో నమోదైంది. దీని తయారీకి 9 గంటల 20 నిముషాలు పట్టిందని నిర్వాహాకులు తెలిపారు. ఆ తర్వాత ఇంతకన్నా ఎక్కువ మొత్తంలో లడ్డూ తయారీ అయినా రికార్డుల్లోకి రాలేదు.