Sat Nov 23 2024 04:16:33 GMT+0000 (Coordinated Universal Time)
వరుసగా రెండోరోజు స్వల్పంగా తగ్గిన బంగారం ధర
వరుసగా రెండోరోజు బంగారం ధర స్వల్పంగా తగ్గింది. మంగళవారానికి 22 క్యారెట్ల బంగారం తులంపై రూ.90 తగ్గగా.. 24 క్యారెట్ల బంగారం
వరుసగా రెండోరోజు బంగారం ధర స్వల్పంగా తగ్గింది. మంగళవారానికి 22 క్యారెట్ల బంగారం తులంపై రూ.90 తగ్గగా.. 24 క్యారెట్ల బంగారం తులం ధర రూ.130 మేర తగ్గింది. వెండి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.45,990 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,050 లుగా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,900 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.50,050, చెన్నై నగరంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,270, 24 క్యారెట్ల ధర రూ.51,570 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,900 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.50,050 ఉంది. కేరళలో 22 క్యారెట్ల ధర రూ.45,900 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.50,050 వద్ద కొనసాగుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో..
హైదరాబాద్ లో 22 క్యారెట్లు 10 గ్రాముల బంగారం ధర రూ.45,900 ఉండగా, 24 క్యారెట్లు 10 గ్రాముల ధర బంగారం రూ.50,050 గా ఉంది. ఇక విజయవాడ, విశాఖపట్నం నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.64,000 గా ఉండగా.. చెన్నైలో కిలో వెండి రూ.68,200 పలుకుతోంది. బెంగళూరు, కేరళ, హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో కిలో వెండి ధర రూ.70,000గా ఉంది.
Next Story