బంగారం వినియోగంలో మనమెక్కడ?
బంగారం ఉత్పత్తిలో ప్రధమ స్థానంలో ఉన్న దేశం మీకు తెలుసా? బంగారం వినియోగంలో మన దేశం ఎన్నో స్థానంలో ఉందో తెలుసా? స్వర్ణం మనకు అత్యంత ప్రియమైన లోహం. పండుగలు, వేడుకలు, శుభకార్యాల్లో బంగారం కళకళలు కనిపిస్తూ ఉంటాయి. కనకం వినియోగంలో మన దేశం ప్రపంచంలోనే రెండో స్థానాన్ని ఆక్రమిస్తోంది.
బంగారం ఉత్పత్తిలో ప్రధమ స్థానంలో ఉన్న దేశం మీకు తెలుసా? బంగారం వినియోగంలో మన దేశం ఎన్నో స్థానంలో ఉందో తెలుసా? స్వర్ణం మనకు అత్యంత ప్రియమైన లోహం. పండుగలు, వేడుకలు, శుభకార్యాల్లో బంగారం కళకళలు కనిపిస్తూ ఉంటాయి. కనకం వినియోగంలో మన దేశం ప్రపంచంలోనే రెండో స్థానాన్ని ఆక్రమిస్తోంది. 2023లో భారతీయులు 750 కోట్ల బంగారాన్ని కొనుగోలు చేశారు. మన పొరుగున ఉన్న చైనా మొదటి స్థానంలో ఉంది. 2023 లెక్కల ప్రకారం చైనా ఏడాదికి 420 టన్నుల బంగారాన్ని ఉత్పత్తి చేసింది. తర్వాతి మూడు స్థానాల్లో వరుసగా ఆస్ట్రేలియా (330), రష్యా (310), అమెరికా (200)లు ఉన్నాయి. ఈ జాబితాలో భారతదేశం 59వ స్థానంలో ఉంది. మన దేశం 1.4 టన్నులు మాత్రమే ఉత్పత్తి చేయగలిగింది.
స్వర్ణ వినియోగంలో అగ్ర దేశాల్లో ఒకటిగా ఉండటానికి మన దేశ జనాభా ఓ కారణమైతే, మన సంప్రదాయాలు మరో కారణం. వివాహాలు, వేడుకలు, పండగల్లో బంగారం కొనడం దేశం వాసులకు అలవాటు. అందుకే ఆభరణాల బంగారానికి ఇక్కడ ఎక్కువ డిమాండ్ ఉంటుంది. స్వర్ణం వినియోగంలో 60 శాతం మంది గ్రామీణ వాసులే ఉండటం విశేషం. బంగారాన్ని పెట్టుబడి కింద మనవాళ్లు భావిస్తారు. ధర పెరిగితే లాభాలు వస్తాయని కొందరు, ఆపత్కాలంలో ఆర్థికంగా ఆదుకుంటుందని మరి కొందరు బంగారం కొనుగోలుపై ఆసక్తి చూపిస్తారు. బంగారం ధర ఎప్పుడూ పెరుగుతూ ఉండటమే ఈ డిమాండ్‌కు మరో కారణం. పదేళ్ల కిందట పది గ్రాముల బంగారం దాదాపు ముప్పయ్ ఐదు వేల వరకూ ఉండగా, ఇప్పుడు అది 60 వేలకు చేరింది. 2000 సంవత్సరంలో లో ఈ ధర దాదాపు నాలుగు వేలు కాగా 1965లో ఈ ధర కేవలం 70 రూపాయలు మాత్రమే కావడం గమనార్హం.