సీటు కింద రెండున్నర కిలోల బంగారం
శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్ అధికారుల తనిఖీల్లో రెండున్నర కిలోల బంగారం బయటపడింది. బంగారం స్వాధీనం చేసుకున్న డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్ [more]
శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్ అధికారుల తనిఖీల్లో రెండున్నర కిలోల బంగారం బయటపడింది. బంగారం స్వాధీనం చేసుకున్న డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్ [more]
శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్ అధికారుల తనిఖీల్లో రెండున్నర కిలోల బంగారం బయటపడింది. బంగారం స్వాధీనం చేసుకున్న డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్ అధికారులు. విచారణ కొనసాగుతోంది. _టెక్నాలజీ యుగంలో స్మగ్లింగ్ రూటు మారింది. స్మగ్లర్లు అంచనాలకు అందని విధంగా ఎప్పటికప్పుడు కొత్తదారులు వెతుకుతున్నారు. తమ చీకటి వ్యాపారాన్ని నిరాటంకంగా కొనసాగిస్తున్నారు. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్ అధికారుల కళ్లుగప్పి గాల్లోనే బంగారాన్ని దేశాలు దాటించేస్తున్నారు. గుట్టుచప్పుడు కాకుండా విమానాల్లో స్మగ్లింగ్ చేస్తున్నారు. కిలోల కొద్దీ బంగారం అధికారుల తనిఖీల్లో బయటపడడమే అందుకు నిదర్శనం. తాజాగా శంషాబాద్ ఎయిర్పోర్టులో రెండు కిలోలకు పైగా బంగారం పట్టుబడింది. కువైట్ నుంచి శంషాబాద్ వచ్చిన విమానం దిగిన ప్రయాణికుడు షేక్ మస్తాన్ బంగారం అక్రమంగా తరలిస్తూ పట్టుబడ్డాడు. అనుమానం వచ్చిన డీఆర్ఐ అధికారులు మస్తాన్ని అదుపులోకి తీసుకుని తనిఖీలు చేయడంతో లోదుస్తుల్లో దాచి ఉంచిన రెండున్నర కిలోల బంగారం బయటపడింది. బంగారం ఎలా తీసుకొచ్చావని ప్రశ్నించిన అధికారులు అతని సమాధానం విని అవాక్కైనట్లు తెలుస్తోంది. ఫ్లైట్లో సీటు కింద బంగారం దాచి.. లోదుస్తుల్లో పెట్టుకుని తరలించే ప్రయత్నం చేస్తూ అడ్డంగా దొరికిపోయినట్లు తెలుస్తోంది. దీనిపై విచారణ చేపట్టారు.