మిక్సర్ లో బంగారం.. కస్టమ్స్ అధికారుల పట్టివేత
లక్నో అంతర్జాతీయ విమానాశ్రయం లో మరోసారి బంగారం పట్టుబడింది. షార్జా నుండి వారణాసి వచ్చిన ఓ ప్రయాణీకుడి వద్ద కస్టమ్స్ అధికారులు 700 గ్రాముల బంగారాన్ని స్వాధీనం [more]
లక్నో అంతర్జాతీయ విమానాశ్రయం లో మరోసారి బంగారం పట్టుబడింది. షార్జా నుండి వారణాసి వచ్చిన ఓ ప్రయాణీకుడి వద్ద కస్టమ్స్ అధికారులు 700 గ్రాముల బంగారాన్ని స్వాధీనం [more]
లక్నో అంతర్జాతీయ విమానాశ్రయం లో మరోసారి బంగారం పట్టుబడింది. షార్జా నుండి వారణాసి వచ్చిన ఓ ప్రయాణీకుడి వద్ద కస్టమ్స్ అధికారులు 700 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అతని పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. షార్జా నుండి ఎయిర్ ఇండియా విమానం లో వారణాసి వచ్చిన ఓ ప్రయాణీకుడి వద్ద కస్టమ్స్ అధికారులు అక్రమ బంగారాన్ని గుర్తించారు. కస్టమ్స్ అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికి ప్రయాణీకుల ముసుగులో భారత్ కు వస్తున్న స్మగ్లర్లు ఏదో ఒక రూపంలో బంగారాన్ని తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. షార్జా నుండి వచ్చిన సదరు ప్రయాణీకుడు తన తో పాటు ఓ కొత్త మిక్సర్ గ్రైండర్ ను మోసుకొని వచ్చాడు. మిక్సర్ ను తన లగేజ్ బ్యాగ్ లో దాచి గ్రీన్ చానెల్ ద్వారా బయటకు వెళ్లే ప్రయత్నం చేసాడు. అయితే ప్రయాణీకుడి వ్యవహారశైలి లో అనుమానం వచ్చిన కస్టమ్స్ అధికారులు…అతను తెచ్చిన మిక్సర్ బరువును తూకం వెసారు. అలాగే ఆన్లైన్ లో సేమ్ కంపెనీ కి చెందిన బరువు ఎంత వుందో చూసారు. ప్రయాణీకుడి మోసుకొని వచ్చిన మిక్సర్ 700 గ్రాముల బరువు ఎక్కువ వుండడంతో అనుమానం వచ్చి తమదైన స్టైల్ లో విచారణ చేసారు. మిక్సర్ ను పూర్తిగా విప్పి చూస్తే అక్రమ బంగారం గుట్టు రట్టు అయింది. మిక్సర్ గ్రైండర్ లో దాచిన 33 లక్షల విలువ చేసే బంగారాన్ని స్వాధీనం చేసుకొని స్మగ్లర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రయాణీకుడిని వారణాసి మెజిస్ట్రేట్ ముందు ప్రవేశ పెట్టారు కస్టమ్స్ అధికారులు.