Sun Dec 22 2024 21:34:43 GMT+0000 (Coordinated Universal Time)
అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. 26 ప్రత్యేక రైళ్లు
నవంబరు 27, డిసెంబరు 11, 25, జనవరి 1, 15 తేదీల్లో సికింద్రాబాద్-కొల్లాం (07121) రైలు మధ్యాహ్నం బయల్దేరి.. కాజీపేట, ఖమ్మం
శబరిమల వెళ్లే భక్తులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. అయ్యప్పస్వామి దర్శనార్థం.. శబరిమల వెళ్లి వచ్చే భక్తుల కోసం మొత్తం 26 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్టు ప్రకటించింది. సికింద్రాబాద్ నుంచి కొల్లాం, కొట్టాయంకు ఈ రైళ్లు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. ఈ నెల 20, డిసెంబర్ 4,18, జనవరి 8 తేదీల్లో సాయంత్రం 4 గంటలకు సికింద్రాబాద్ నుండి సికింద్రాబాద్-కొల్లాం (07117) రైలు బయల్దేరుతుంది. ఆ మరుసటి రోజుల్లో రాత్రి 11 గంటలకు కొల్లాం చేరుకుంటుంది. ఈ రైలు కాచిగూడ, మహబూబ్నగర్, గద్వాల మీదుగా ప్రయాణిస్తుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07118) నవంబరు 22 డిసెంబరు 6, 20, జనవరి 10 తేదీల్లో మధ్యాహ్నం 2.30 గంటలకు కొల్లాంలో బయలుదేరి తర్వాతి రోజు ఉదయం 9.05 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.
అలాగే.. నవంబరు 27, డిసెంబరు 11, 25, జనవరి 1, 15 తేదీల్లో సికింద్రాబాద్-కొల్లాం (07121) రైలు మధ్యాహ్నం బయల్దేరి.. కాజీపేట, ఖమ్మం మీదుగా మర్నాడు రాత్రికి కొల్లాం చేరుకుంటుంది. కొల్లాం-సికింద్రాబాద్ (07122) రైలు నవంబరు 29, డిసెంబరు 13, 27, జనవరి 3, 17 తేదీల్లో తెల్లవారుజామున 2.30 గంటలకు బయలుదేరి తర్వాతి రోజు రాత్రి 10 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. నవంబరు 21, 28 తేదీల్లో.. సికింద్రాబాద్-కొల్లాం (07123) రైలు మధ్యాహ్నం 2.30 గంటలకు బయల్దేరి తర్వాతి రోజు ఉదయం 11 గంటలకు కొల్లాం చేరుకుంటుంది.
నవంబరు 20, 27 తేదీల్లో సికింద్రాబాద్ నుంచి కొట్టాయం వెళ్లే రైలు (07125) సాయంత్రం 6.50 గంటలకు సికింద్రాబాద్లో బయలుదేరి తర్వాతి రోజు రాత్రి 9 గంటలకు కొట్టాయం చేరుతుంది. ఈ రైలు చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ మార్గంలో ప్రయాణిస్తుంది. కొట్టాయం నుంచి సికింద్రాబాద్ వెళ్లే రైలు (07126) నవంబరు 21, 28 తేదీల్లో సోమవారం రాత్రి 11.20 గంటలకు బయలుదేరి బుధవారం తెల్లవారుజామున 4 గంటలకు కొట్టాయం చేరుకుంటుంది. భక్తులు ఈ వివరాలను గమనించి.. తమ ప్రయాణాన్ని
Next Story