Dgp : పట్టాభిని వదిలే ప్రసక్తి లేదు
ఒక ముఖ్యమంత్రి ని అసభ్య పదజాలంతో దూషించడమేంటని గౌతం సవాంగ్ ప్రశ్నించారు. తాము ఈ విషయంలో సీరియస్ గా తీసుకున్నామన్నారు. ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడిన వారిపై [more]
ఒక ముఖ్యమంత్రి ని అసభ్య పదజాలంతో దూషించడమేంటని గౌతం సవాంగ్ ప్రశ్నించారు. తాము ఈ విషయంలో సీరియస్ గా తీసుకున్నామన్నారు. ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడిన వారిపై [more]
ఒక ముఖ్యమంత్రి ని అసభ్య పదజాలంతో దూషించడమేంటని గౌతం సవాంగ్ ప్రశ్నించారు. తాము ఈ విషయంలో సీరియస్ గా తీసుకున్నామన్నారు. ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడిన వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని గౌతం సవాంగ్ తెలిపారు. పట్టాభి ఒకటి కాదు రెండు అనేకసార్లు అదే పదాలు వాడారని, స్లిప్ అయినవి కాదని గౌతం సవాంగ్ అన్నారు. ఒక పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి మరీ దూషించడాన్ని తీవ్ర నేరంగా పరిగణిస్తామని గౌతం సవాంగ్ తెలిపారు. పట్టాభి వాడిన భాషను తాను కూడా ఎప్పుడూ వినలేదన్నారు. చంద్రబాబు ఫోన్ చేస్తే తాను ఫోన్ లిఫ్ట్ చేయలేదనడం సరికాదన్నారు.
డ్రగ్స్ పై ఎన్నిసార్లు క్లారిటీ ఇచ్చినా….
గుజరాత్ లో దొరికిన డ్రగ్స్ కు ఆంధ్రప్రదేశ్ కు ఎటువంటి సంబంధం లేదని డీజీపీ గౌతం సవాంగ్ తెలిపారు. ఒక్క గ్రాము హెరాయిన్ కూడా ఏపీకి రాలేదన్నారు. ఎన్ని సార్లు చెప్పినా రాజకీయ పార్టీలు ఆరోపణలు మానుకోవడం లేదని గౌతం సవాంగ్ అన్నారు. ఆ కేసును ఎన్ఐఏ దర్యాప్తు చేస్తుందని చెప్పారు. ఎన్ఐఏ కూడా ఏపీకి ఎలాంటి సంబంధం లేదని చెప్పినా విమర్శలు చేయడం మానుకోలేదని గౌతం సవాంగ్ తెలిపారు. డ్రగ్స్ కి, ఏపీకి లింక్ పెట్టడం సరికాదని తాను కూడా చెప్పినా వినిపించుకోక పోవడం దురదృష్టకరమని చెప్పారు.