16 నుంచి ఏపీకి బస్సులు
ఈ నెల 16 నుంచి హైదరాబాద్ నుంచి ఏపీకి బస్సులు నడపాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్ లో చిక్కుకున్న వారిని స్వస్థలాలకు చేర్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక [more]
ఈ నెల 16 నుంచి హైదరాబాద్ నుంచి ఏపీకి బస్సులు నడపాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్ లో చిక్కుకున్న వారిని స్వస్థలాలకు చేర్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక [more]
ఈ నెల 16 నుంచి హైదరాబాద్ నుంచి ఏపీకి బస్సులు నడపాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్ లో చిక్కుకున్న వారిని స్వస్థలాలకు చేర్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయనుంది. అయితే ఏపీకి వచ్చే వారు ముందుగా స్పందన పోర్టల్ లో నమోదు చేసుకోవాలని ప్రభుత్వం కోరింది. 14 రోజులు క్వారంటైన్ లో ఉండేందుకు అంగీకరిస్తేనే వారికి బస్సుల్లో ప్రయాణానికి అనుమతిస్తామని ప్రభుత్వం తెలిపింది. ఈ నెల 16వ తేదీ నుంచి హైదరాబాద్ లోని కేపీహెచ్ బి, మియాపూర్, బొల్లారం క్రాస్ రోడ్స్, ఎల్ బి నగర్ నుంచి బస్సులు బయలుదేరనున్నాయి. ఏపీకి వచ్చే వారు దరఖాస్తు చేసుకోవచ్చని ప్రభుత్వం ప్రకటించింది.