ఏపీలోకి వెళ్లాంటే ఇప్పుడప్పుడే?
అంతరాష్ట్ర రాకపోకలపై మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. అత్యవసర పరిస్థితుల్లో తప్ప వ్యక్తిగతంగా ఎవరినీ ఏపీలోకి అనుమతించేది లేదని స్పష్టం చేసింది. అయితే వలస కూలీల విషయంలో [more]
అంతరాష్ట్ర రాకపోకలపై మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. అత్యవసర పరిస్థితుల్లో తప్ప వ్యక్తిగతంగా ఎవరినీ ఏపీలోకి అనుమతించేది లేదని స్పష్టం చేసింది. అయితే వలస కూలీల విషయంలో [more]
అంతరాష్ట్ర రాకపోకలపై మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. అత్యవసర పరిస్థితుల్లో తప్ప వ్యక్తిగతంగా ఎవరినీ ఏపీలోకి అనుమతించేది లేదని స్పష్టం చేసింది. అయితే వలస కూలీల విషయంలో మాత్రం వారి రాష్ట్రాలకు పంపడానికి రెడీ అయింది. ఇప్పటికే రిలీఫ్ క్యాంప్ లలో ఉన్న వలస కూలీలను వారి రాష్ట్రాలకు పంపాలని నిర్ణయించింది. అయితే ఇందుకు ఆ రాష్ట్రాలు సమ్మతి తెలియజేయాలని పేర్కొంది. ఇప్పటికే ఏపీల నుంచి ఒక రైలు వలస కార్మికులతో మహారాష్ట్రకు బయలుదేరి వెళ్లింది. మరో ఐదు రైళ్ల ద్వారా వలస కార్మికులను తరలించాలని నిర్ణయించింది. వ్యక్తిగతంగా మాత్రం ఇప్పట్లో ఎవరినీ రాష్ట్రంలోకి అనుమతించేది లేదని ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది.