Mon Dec 23 2024 12:55:45 GMT+0000 (Coordinated Universal Time)
పొగతో ఊపిరాడకనే మృతి?
సికింద్రాబాద్ అగ్ని ప్రమాద ఘటనపై ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించింది. ఊపిరాడక ఎక్కువ మంది చనిపోయారని తెలుస్తోంది
సెల్లార్ లో ఎలక్ట్రిక్ బ్యాటరీ షోరూంలో బ్యాటరీ పేలడంతో సిికింద్రాబాద్ లో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకూ ఎనిమిది మంది వరకూ చనిపోయారు. అయితే ఈ బిల్దింగ్ అనుమతులపై మున్సిపల్ అధికారులు ఆరా తీస్తున్నారు. కింద బ్యాటరీలు పేలినా పొగ లాడ్జిలోకి వ్యాపించడంతో ఊపిరాడక ఎక్కువ మంది చనిపోయారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. రూబీ హోటల్ లోకి వెళ్లేందుకు ఒక లిఫ్ట్ మాత్రమే ఉంది. లిఫ్ట్ కూడా చాలా చిన్నదిగా ఉండటం, ప్రమాద సమయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో కొందరు పైనుంచి కిందకు దూకారు.
టి ఫైర్ సేఫ్టీ నిబంధనలు..
నాలుగు అంతస్థు భవనంలో ఎలాంటి ఫైర్ సేఫ్టీ నిబంధనలను పాటించడం లేదని తెలిసింది. ఈ ప్రమాద ఘటనకు సంబంధించి విద్యుత్తు అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాల్సి ఉంది. ఈ రూబీ హోటల్ లో ఎప్పుడు రద్దీగానే ఉంటుంది. రైల్వే స్టేషన్ కు సమీపంలో ఉండటంతో టూరిస్ట్ లు ఇక్కడే బస చేసి నగరంలో తమ పనులు పూర్తి చేసుకుని వెళతారు. అందుకే ఎప్పుడూ ఈ హోటల్ రద్దీగా ఉంటుందని అంటున్నారు.
పార్కింగ్ ప్లేస్ ను...
ప్రమాదం జరిగిన సమయంలో ముగ్గురు పైనుంచి కిందకు దూకడంతో గాయాలపాలయ్యారు. ఎక్కువగా బంగారం వ్యాపారం చేసేవాళ్లు ఇక్కడకు వచ్చి బస చేస్తుంటారని పోలీసులు చెబుతున్నారు. పార్కింగ్ ప్లేస్ ను గోదాము కింద ఉపయోగిస్తూ బ్యాటరీలను ఛార్జింగ్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మెట్ల దారి ఇరుకుగా ఉండటం, పొగ వ్యాపించడంతో ఎక్కువ మంది ఊపిరాడక మృతి చెందారు. పొగలు మొదటి, రెండు అంతస్థుల వరకూ వ్యాపించాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఈ ప్రమాద ఘటనపై స్పందించారు. మృతుల కుటుంబాలకు రెండు లక్షల రూపాయలు, గాయపడిన వారికి యాభై వేల రూపాయలు ఎక్స్ గ్రేషియో ప్రకటించారు. సికింద్రాబాద్ అగ్ని ప్రమాద ఘటనపై ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించింది
Next Story