ఏపీలో అన్నీ తెరుచుకోనున్నాయ్.. వాటికి మాత్రం మినహాయింపు లేదు
ఆంధ్రప్రదేశ్ లో లాక్ డౌన్ మినహాయింపులపై ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. వస్త్ర, చెప్పుల దుకాణాలు, షాపింగ్ మాల్స్ , బంగారు దుకాణాలు తెరిచేందుకు ఎలాంటి అనుమతులు [more]
ఆంధ్రప్రదేశ్ లో లాక్ డౌన్ మినహాయింపులపై ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. వస్త్ర, చెప్పుల దుకాణాలు, షాపింగ్ మాల్స్ , బంగారు దుకాణాలు తెరిచేందుకు ఎలాంటి అనుమతులు [more]
ఆంధ్రప్రదేశ్ లో లాక్ డౌన్ మినహాయింపులపై ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. వస్త్ర, చెప్పుల దుకాణాలు, షాపింగ్ మాల్స్ , బంగారు దుకాణాలు తెరిచేందుకు ఎలాంటి అనుమతులు లేవని ప్రభుత్వం స్పష్టం చేసింది. మిగిలిన అన్ని దుకాణాలను ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ తెరుచుకోవచ్చని పేర్కొంది. అయితే కంటెయిన్మెంట్ జోన్లు, బఫర్ జోన్లలో మాత్రం ఎలాంటి దుకాణాలు తెరవడానికి వీలులేదు. ఇక కూరగాయాలు, పాలు వంటి దుకాణాలకు అన్ని ప్రాంతాల్లో ఉదయం ఆరు నుంచి పదకొండు గంటల వరకూ మాత్రమే అనుమతిస్తారు. తెరిచిన దుకాణాల వద్ద సోషల్ డిస్టెన్స్ ను పాటించాలని, శానిటైజర్లను ఏర్పాటు చేయాలని, అలా చేయకుంటే చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది.