తెలంగాణలో ఆంక్షలు విధించిన ప్రభుత్వం
తెలంగాణలో రాత్రి కర్ఫ్యూ పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నెల 15వ తేదీ వరకూ కర్ఫ్యూ కొనసాగుతుందని ప్రభుత్వం వెల్లడించింది. నేటితో రాత్రి వేళ కర్ఫ్యూ [more]
తెలంగాణలో రాత్రి కర్ఫ్యూ పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నెల 15వ తేదీ వరకూ కర్ఫ్యూ కొనసాగుతుందని ప్రభుత్వం వెల్లడించింది. నేటితో రాత్రి వేళ కర్ఫ్యూ [more]
తెలంగాణలో రాత్రి కర్ఫ్యూ పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నెల 15వ తేదీ వరకూ కర్ఫ్యూ కొనసాగుతుందని ప్రభుత్వం వెల్లడించింది. నేటితో రాత్రి వేళ కర్ఫ్యూ గడువు పూర్తవుతున్న సందర్భంలో మరో వారం రోజుల పాటు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కరోనా కేసులు పెరుగుతుండటంతో రాత్రి పూట కర్ఫ్యూ కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తుంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో లాక్ డౌన్ విధించే ఆలోచన లేదని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. రాత్రి వేళ కర్ఫ్యూ ను మాత్రం తెలంగాణలో కొనసాగించాలని నిర్ణయించారు. పెళ్లిళ్లకు వందమందినే అనుమతిస్తారు. అంత్యక్రియలకు ఇరవై మందే హాజరు కావాలి. ప్రజలు మాస్క్ లను ఖచ్చితంగా ధరించాలి. భౌతిక దూరం పాటించాలని ప్రభుత్వం పేర్కొంది. తెలంగాణలో ఎలాంటి రాజకీయ, మత, సాంస్కృతిక కార్యక్రమాలు, బహిరంగ సభలు, ర్యాలీలకు అనుమతి లేదని పేర్కొంది