Fri Jan 10 2025 03:12:42 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : పంచాయితీ ఎన్నికలపై కీలక తీర్పు
తెలంగాణలో త్వరలోనే మరో ఎన్నికల రంగం సిద్ధమవుతోంది. రాష్ట్రంలో పంచాయితీ ఎన్నికల నిర్వహణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైనా పంచాయితీ ఎన్నికలు నిర్వహించవచ్చని కోర్టు స్పష్టం చేసింది. దీంతో జనవరి లేదా ఫిబ్రవరీలో తెలంగాణలో పంచాయితీ ఎన్నికల సందడి మొదలయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ పలు సందర్భాల్లో మాట్లాడుతూ... అసెంబ్లీ ఎన్నికలు జరగగానే పంచాయితీ ఎన్నికలు వస్తాయని చెప్పిన విషయం తెలిసిందే.
Next Story