ఎంపీ అనుచరుడినంటూ గన్ పట్టుకుని?
హైదరాబాదులో గన్ కల్చర్ పెరిగిపోతోంది. ఎవరు పడితే వాళ్ళు తుపాకులు పట్టుకొని రోడ్లమీద తిరుగుతున్నారు. రాజకీయ నాయకులకు ఇది పారి పాటే పోయింది. మాదాపూర్ లో అర్ధరాత్రి [more]
హైదరాబాదులో గన్ కల్చర్ పెరిగిపోతోంది. ఎవరు పడితే వాళ్ళు తుపాకులు పట్టుకొని రోడ్లమీద తిరుగుతున్నారు. రాజకీయ నాయకులకు ఇది పారి పాటే పోయింది. మాదాపూర్ లో అర్ధరాత్రి [more]
హైదరాబాదులో గన్ కల్చర్ పెరిగిపోతోంది. ఎవరు పడితే వాళ్ళు తుపాకులు పట్టుకొని రోడ్లమీద తిరుగుతున్నారు. రాజకీయ నాయకులకు ఇది పారి పాటే పోయింది. మాదాపూర్ లో అర్ధరాత్రి ఒక వ్యక్తి తుపాకి పట్టుకుని హల్ చల్ చేయడం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. తాను ఒక ఎంపీ అనుచరుడినని చెప్పి కారు స్టికర్ వేసుకుని మరీ హంగామా చేశాడు. మాదాపూర్ లోని బస్తీ లో జరిగిన ఈ హంగామా పైన పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నారు.. ఫోన్ మాట్లాడుకుంటూ గన్ తో బెదిరిస్తూ నానా రచ్చ చేశాడు. మాదాపూర్ బస్తీ లో తుపాకితో హల చల్ చేసిన వ్యక్తి ఎవరన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. స్కార్పియో వాహనం లో వచ్చిన వ్యక్తి గన్ తో నానా హుల్చుల్ చేశాడు. రోడ్ల పై వాహనాలు ఎందుకు నిలిపారు అంటూ స్థానిక ప్రజలపై గన్ చూపిస్తూ తుపాకీ తో చంపేస్తానంటూ సదరు వ్యక్తి బెదిరించాడు. స్థానికులు అంతా ఒక్కసారి ఎదురు తిరగడంతో సదరు వ్యక్తి అక్కడినుంచి పారిపోయాడు.