Gutha suman : ఆంధ్రా నుంచి వచ్చి తెలంగాణలో…?
పేకాట కేసులో గుత్తా సుమన్ ను నేడు, రేపు పోలీసులు విచారించనున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి తెలంగాణలో పెద్దయెత్తున క్లబ్ లను నిర్వహిస్తున్నాడు. ఇటీవల నార్సింగ్ లోని [more]
పేకాట కేసులో గుత్తా సుమన్ ను నేడు, రేపు పోలీసులు విచారించనున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి తెలంగాణలో పెద్దయెత్తున క్లబ్ లను నిర్వహిస్తున్నాడు. ఇటీవల నార్సింగ్ లోని [more]
పేకాట కేసులో గుత్తా సుమన్ ను నేడు, రేపు పోలీసులు విచారించనున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి తెలంగాణలో పెద్దయెత్తున క్లబ్ లను నిర్వహిస్తున్నాడు. ఇటీవల నార్సింగ్ లోని మంచిరేవులలో హీరో నాగశౌర్యకు చెందిన ఫాంహౌస్ లో పేకాటరాయుళ్లు పోలీసులక పట్టుబడిన సంగతి తెలిసిందే. ఈ కేసులో 29 మందికి బెయిల్ లభించింది. కీలక సూత్రధారి అయిన గుత్తా సుమన్ ను మాత్రం పోలీసులు కస్టడీకి కోరారు.
అనేక కేసులు…
గుత్తా సుమన్ పై ఆంధ్రప్రదేశ్ లోనూ ఛీటింగ్, భూ ఆక్రమణ కేసులున్నాయి. అక్కడ మామిడితోటల్లో పేకాట నిర్వహించేవాడు. డిజిటల్ పద్ధతిలోనే గుత్తా సుమన్ పేకాట ఆడేవారి నుంచి నగదును తీసుకునేవారు. హైదరాబాద్ లోని రెస్టారెంట్లు, హోటళ్లను అద్దెకు తీసుకుని మరీ పేకాట ను ఆడించేవారు. కోట్ల రూపాయల్లో ఈ ఆటలను నిర్వహించేవాడు. గుంటూరుకు చెందిన గుత్తా సుమన్ పెద్దయెత్తున పేకాటను నిర్వహించడం ద్వారా సంపాదించాడు. పోలీసుల విచారణలో మరిన్ని విషయాలు వెలుగు చూసే అవకాశముంది.