Mon Dec 23 2024 11:56:45 GMT+0000 (Coordinated Universal Time)
శ్రీనివాస్ రెడ్డి ఇంటిని తగలబెట్టిన గ్రామస్థులు
వరుస హత్యల నేపథ్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హజీపూర్ లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. శ్రావణి, మనీషా హత్యల నేపథ్యంలో గ్రామస్థులు తీవ్ర ఆగ్రాహంతో ఉన్నారు. [more]
వరుస హత్యల నేపథ్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హజీపూర్ లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. శ్రావణి, మనీషా హత్యల నేపథ్యంలో గ్రామస్థులు తీవ్ర ఆగ్రాహంతో ఉన్నారు. [more]
వరుస హత్యల నేపథ్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హజీపూర్ లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. శ్రావణి, మనీషా హత్యల నేపథ్యంలో గ్రామస్థులు తీవ్ర ఆగ్రాహంతో ఉన్నారు. ఇవాళ గ్రామస్థులంతా కలిసి నిందితుడు సైకో కిల్లర్ శ్రీనివాస్ రెడ్డి ఇంటిపై దాడి చేసి తగులబెట్టారు. అడ్డుకున్న పోలీసులపై కూడా గ్రామస్థులు ఎదురుతిరిగి వాగ్వాదానికి దిగారు. 2015 నుంచి గ్రామంలో కనిపించకుండాపోయిన కల్పన అనే ఆరేళ్ల బాలికను కూడా శ్రీనివాస్ హత్య చేసి ఉంటారని గ్రామస్థులు అనుమానిస్తున్నారు. ఇంతటి దారుణాలకు పాల్పడ్డ నిందితుడిని ఎన్ కౌంటర్ చేయాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.
Next Story