కేఈ ప్రభాకర్ కు చంద్రబాబు ఫోన్
సీఆర్డీఏ రద్దు, వికేంద్రీకరణ బిల్లులపై శాసన మండలిలో టీడీపీ నోటీసు లిచ్చింది. వికేంద్రీకరణ బిల్లులపై చర్చించకూడదని రూల్ 90 కింద టీడీపీ శాసన మండలి పక్షం నోటీసులు [more]
సీఆర్డీఏ రద్దు, వికేంద్రీకరణ బిల్లులపై శాసన మండలిలో టీడీపీ నోటీసు లిచ్చింది. వికేంద్రీకరణ బిల్లులపై చర్చించకూడదని రూల్ 90 కింద టీడీపీ శాసన మండలి పక్షం నోటీసులు [more]
సీఆర్డీఏ రద్దు, వికేంద్రీకరణ బిల్లులపై శాసన మండలిలో టీడీపీ నోటీసు లిచ్చింది. వికేంద్రీకరణ బిల్లులపై చర్చించకూడదని రూల్ 90 కింద టీడీపీ శాసన మండలి పక్షం నోటీసులు ఇచ్చింది. ఈ బిల్లులు గతంలోనే సెలెక్ట్ కమిటీ ముందున్నాయని నోటీసులో పేర్కొన్నారు. గతంలో ఈ బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపినా సెక్రటరీ దానికి అనుగుణంగా వ్యవహరించ లేదని పేర్కొన్నారు. పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకునే అధికారం మండలి ఛైర్మనుకు ఉందని నోటీసులో టీడీపీ స్పష్టం చేసింది. ఈ బిల్లులను సెలెక్ట్ కమిటీకే పంపాలని నోటీసులో టీడీపీ ఎమ్మెల్సీలు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా కొందరు ఎమ్మెల్సీలు మండలికి గైర్హాజరయ్యారు. టీడీపీ తమకు 23 మంది సభ్యుల బలం ఉందని చెబోతోంది. చంద్రబాబు కూడా కేఈ ప్రభాకర్ తో మాట్లాడారు. చిన్న విషయాలు తప్ప తనకు పార్టీతో ఇబ్బందులేవీ లేవని చెప్పారు. శాసనమండలిలో రెండు పక్షాలు ఎవరి వ్యూహాలు వారు రచించుకుంటున్నారు.