Mon Dec 23 2024 02:57:03 GMT+0000 (Coordinated Universal Time)
Harbhajan Singh : కోహ్లీ, రాహుల్ భార్యలపై హర్భజన్ వైరల్ కామెంట్స్..
వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో మాజీ క్రికెటర్ హర్భజన్.. కోహ్లీ, కెఎల్ రాహుల్ భార్యలపై చేసిన కామెంట్స్ వైరల్గా మారాయి.
అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన క్రికెట్ ప్రపంచ కప్ తుది పోరు హోరాహోరీగా ముగిసింది. ఫైనల్ లో భారత్, ఆస్ట్రేలియా టీమ్స్ తలపడ్డాయి. 2003 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ లో కూడా భారత్, ఆస్ట్రేలియా తలపడగా.. అప్పుడు ఆస్ట్రేలియా ట్రోఫీని సాధించింది. దీంతో ఈసారి భారత్, ఆస్ట్రేలియా పై విజయం సాధించి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని ప్రతి ఒక్కరు ఆశించారు. కానీ ఆ ఆశలు నిరాశగా మారాయి. ఆదివారం జరిగిన తుదిపోరులో భారత్ ఓటమిని ఎదుర్కొంది.
ఇక ఈ ఓటమితో భారత్ ఆటగాళ్లంతా కన్నీటి పర్యంతం అయ్యారు. రోహిత్, కోహ్లీ కళ్ళలో నీళ్లు చూసి ప్రతి భారతీయుడు గుండె బరువెక్కుతుంది. వారిని అలా చూసిన అభిమానులు.. ధైర్యం చెబుతూ కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా వారిని సపోర్ట్ చేస్తూ పోస్టులు వేస్తున్నారు. ఇది ఇలా ఉంటే, ఈ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో హిందీ కామెంటరీలో భారత్ మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్.. కోహ్లీ, కెఎల్ రాహుల్ భార్యలపై చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.
కోహ్లీ సతీమణి అనుష్క శర్మ, రాహుల్ భార్య అతియా శెట్టి బాలీవుడ్ పరిశ్రమలో హీరోయిన్స్ గా రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఇక నిన్న జరిగిన ఫైనల్ మ్యాచ్ లో తమ భర్తలను ఎంకరేజ్ చేసేందుకు వారిద్దరూ కూడా స్టేడియంకి వచ్చారు. అనుష్క, అతియా పక్కపక్కనే కూర్చొని మ్యాచ్ ని వీక్షించారు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో పలుమార్లు కెమెరాలు వారిపై ఫోకస్ చేశాయి. ఆ సమయంలోనే కామెంటరీ సెక్షన్ లో ఉన్న హర్భజన్ వారిని ఉద్దేశిస్తూ వైరల్ కామెంట్స్ చేశారు.
అనుష్క, అతియా మ్యాచ్ సమయంలో సీరియస్ గా మాట్లాడుతూ కనిపించారు. వారు ఏం మాట్లాడుకుంటున్నారు అని చర్చిస్తూ హర్భజన్ ఇలా కామెంట్స్ చేశారు.. "వారిద్దరికీ క్రికెట్ గురించి పెద్దగా తెలియదని, కాబట్టి సినిమా లేదా యాడ్స్ గురించే మాట్లాడుకుంటూ ఉండొచ్చని" అంటూ కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలు పై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హర్భజన్ చేసిన కామెంట్స్ పురుషాధిక్యాన్ని చూపించేలా ఉన్నాయంటూ మండిపడుతున్నారు. ఈ విషయంలో హర్భజన్.. అనుష్క, అతియాలకు క్షమాపణలు చెప్పాలని కోరుతూ పోస్తూ వేస్తున్నారు.
Next Story