Wed Dec 25 2024 01:24:20 GMT+0000 (Coordinated Universal Time)
భావోద్వేగానికి గురైన హరీశ్
సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు భావోద్వేగానికి గురయ్యారు. వరుసగా ఆరవసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన ఇవాళ సిద్ధిపేటలో బతుకమ్మ చీరల పంపిణి కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ... తనను లక్షకు పైగా మెజారిటీతో గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్ని జన్మలు ఎత్తినా సిద్ధిపేట ప్రజల రుణం తీర్చుకోలేనిదని... తన చర్మం వదిలి చెప్పులు కుట్టించినా తక్కువేనన్నారు. ఈ జన్మ ఉన్నంతవరకు సిద్ధిపేట ప్రజల కోసం పనిచేస్తాన్నారు. తమపై నమ్మకంతో ప్రజలు టీఆర్ఎస్ ని అధికారంలోకి తెచ్చారని, అంతే నమ్మకంగా ప్రజలకు సేవ చేస్తామన్నారు.
Next Story