తెలంగాణలో సెకండ్ వేవ్ ప్రారంభమయినట్లే
తెలంగాణలో లాక్డౌన్, కర్ఫ్యూ విధించే యోచనలేది ప్రస్తుతానికి లేదని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు స్పష్టంచేశారు. విద్యాసంస్థల్లో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని తెలిపారు. విద్యార్థుల ద్వారా ఇంట్లోని [more]

తెలంగాణలో లాక్డౌన్, కర్ఫ్యూ విధించే యోచనలేది ప్రస్తుతానికి లేదని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు స్పష్టంచేశారు. విద్యాసంస్థల్లో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని తెలిపారు. విద్యార్థుల ద్వారా ఇంట్లోని వారికి కరోనా సోకే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశారు. పాజిటివ్ కేసుల పెరుగుదలను బట్టి సెకండ్ వేవ్ అనే భావిస్తున్నామని అన్నారు. కరోనా నియంత్రణకు ప్రజలంతా సహకరించాలి. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని, భౌతికదూరం పాటించాలని శ్రీనివాస రావుసూచించారు. అర్హులందరూ టీకా వేయించుకోవాలని, వ్యాక్సినేషన్ పెరిగితే వైరస్ నియంత్రణలోకి వస్తున్నది అన్నారు. కరోనా నియంత్రణకు గతేడాది ఎలాంటి చర్యలు చేపట్టామో.. ఇప్పుడూ అవే మళ్లీ మొదలయ్యాయని తెలిపారు. ప్రజల అప్రమత్తతోనే కరోనా నియంత్రణ సాధ్యమని పేర్కొన్నారు. కరోనా కట్టడికి ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటుందని చెప్పారు.