బ్రేకింగ్ : రాజధానిని తరలించబోం.. స్పష్టం చేసిన ప్రభుత్వం
రాజధాని అమరావతి తరలింపుపై హైకోర్టులో విచారణ జరిగింది. అమరావతి జేఏసీ దాఖలు చేసిన పిటీషన్ ను హైకోర్టు విచారించింది. రాజధాని తరలింపునకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని పిటీషనర్ పేర్కొన్నారు. [more]
రాజధాని అమరావతి తరలింపుపై హైకోర్టులో విచారణ జరిగింది. అమరావతి జేఏసీ దాఖలు చేసిన పిటీషన్ ను హైకోర్టు విచారించింది. రాజధాని తరలింపునకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని పిటీషనర్ పేర్కొన్నారు. [more]
రాజధాని అమరావతి తరలింపుపై హైకోర్టులో విచారణ జరిగింది. అమరావతి జేఏసీ దాఖలు చేసిన పిటీషన్ ను హైకోర్టు విచారించింది. రాజధాని తరలింపునకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని పిటీషనర్ పేర్కొన్నారు. దీనిపై అడ్వకేట్ జనరల్ వివరణ ను హైకోర్టు కోరింది. రాజధానిని ఎట్టిపరిస్థితుల్లో తరలిస్తామని విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలను పిటీషనర్ ఈ సందర్భంగా పిటీషనర్ హైకోర్టు దృష్టికి తెలిపారు. వికేంద్రీకరణ బిల్లు పాస్ కాకుండా రాజధాని తరలింపు చేపట్టబోమని అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు. దీనిపై ప్రమాణ పత్రం సమర్పించాలని హైకోర్టు అడ్వకేట్ జనరల్ ను కోరింది. ప్రమాణపత్రానికి పదిరోజుల సమయం కావాలని అడ్వొకేట్ జనరల్ కోరారు. హైకోర్టు పది రోజుల సమయం ఇచ్చింది. తరలింపునకు ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నం చేసినా ధర్మాసనం దృష్టికి తీసుకురావాలని హైకోర్టు పిటీషనర్ కు సూచించింది.