భారీగా బంగారం పట్టివేత
చెన్నై ఎయిర్ పోర్ట్ లో మరోసారి భారీ బంగారం పట్టుబడింది. 867 గ్రాముల బంగారం పట్టుబడి 12 గంటలు కూడా గడకవ ముందే 1.35 గ్రాముల బంగారంను [more]
చెన్నై ఎయిర్ పోర్ట్ లో మరోసారి భారీ బంగారం పట్టుబడింది. 867 గ్రాముల బంగారం పట్టుబడి 12 గంటలు కూడా గడకవ ముందే 1.35 గ్రాముల బంగారంను [more]
చెన్నై ఎయిర్ పోర్ట్ లో మరోసారి భారీ బంగారం పట్టుబడింది. 867 గ్రాముల బంగారం పట్టుబడి 12 గంటలు కూడా గడకవ ముందే 1.35 గ్రాముల బంగారంను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.. స్మగ్లర్లు కొత్త కొత్త పద్ధతిలో బంగారాన్ని అక్రమంగా రవాణా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ వారి ప్రయత్నాలన్నింటిని కస్టమ్స్ అధికారులు చిత్తు చేస్తున్నారు. స్మగ్లర్లు తెలివిని ఉపయోగించి అక్రమంగా రవాణా చేస్తున్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకోకుండా ఉండేందుకు సీనీ పక్కీలో బంగారాన్ని పేస్టు గా మార్చి సాక్సులో, మోకాలి చిప్పల్లో దాచి పెట్టి అక్రమంగా రవాణా చేయడానికి ప్రయత్నం చేశారు. కానీ బంగారాన్ని అక్రమంగా రవాణా చేస్తున్నట్లు గా కస్టమ్స్ అధికారులకు విశ్వసనీయ మైన సమాచారం రావడంతో అధికారులు తనిఖీలు నిర్వహించారు. కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో అక్రమ బంగారం గుట్టు రట్టయింది. కస్టమ్స్ అధికారులు స్మగ్లర్లను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 1.35 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు అయితే దీని విలువ 63 లక్షల రూపాయలు ఉంటుందని అధికారులు వెల్లడించారు. కస్టమ్స్ అధికారులు స్మగ్లర్లను అదుపులోకి తీసుకుని వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.