చంద్రుడిపై అపారమైన హీలియం నిల్వలు
భూమి అయస్కాంత క్షేత్రం ద్వారా రక్షింపబడుతున్నట్లుగా, చంద్రుడికి హీలియం రక్షణగా ఉంది.
చంద్రుడిపై అపారమైన హీలియం నిల్వలు
భూమి అయస్కాంత క్షేత్రం ద్వారా రక్షింపబడుతున్నట్లుగా, చంద్రుడికి హీలియం రక్షణగా ఉంది.
సూర్యుడి నుంచి వెలువడే గాలుల ద్వార హీలియం ఐసోటోపులు చంద్రుడిపై అపారంగా ఉన్నాయి. దీనిని అణురియాక్టర్లలో వాడటం ద్వారా రేడియో ధార్మికతను నిరోధించవచ్చు.
భూమిపై హీలియం చాలా తక్కువగా ఉంటుంది. చంద్రయాన్-3ని శాస్త్రవేత్తలు పంపడానికి ముఖ్య కారణం ఇదే. హీలియాన్ని మైనింగ్ చేయడం ద్వారా అత్యధిక లాభాలను ఆర్జించవచ్చు. చంద్రుడిపై కొన్ని మీటర్ల లోతువరకు దాదాపు 25 మెట్రిక్ టన్నుల హీలియం ఐసోటోపులు 1.1 మిలియన్ మెట్రిక్ టన్నుల హీలియం-3 ఉన్నాయని, స్పేస్ ఎక్స్ స్టార్ షిప్ ద్వారా కార్గొలో దానిని భూమిపైకి తీసుకురావచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. తద్వారా ఎనర్జీ సంక్షోభాన్ని, పర్యావరణ పరిరక్షణను ఎదుర్కొవచ్చని అంచనా. 100 కేజీల హీలియం 140 మిలియన్ డాలర్ల ఖరీదు చేస్తుంది. దీనితో 1000 మెగా వాట్ల విద్యుత్ ప్లాంట్ ను ఏర్పాటు చేయవచ్చు. హీలియం-3 గ్యాస్ ను నూక్లియర్ ఫ్యూషన్ ( రెండు అణువులను కలిపే ప్రక్రియ)ప్లాంట్లలో ఉపయోగించుకోవచ్చు. విషపూరితం కాని, రంగు, రుచి, వాసనలేని, దేనితోనూ సంయోగం చెందనిది హీలియం గ్యాస్ .
సల్ఫర్ కూడా ...
చంద్రుడిపై చంద్రయాన్ -3 కీలక విషయాలు బయటపెట్టింది. రోవర్ లోని లేజర్ ఇండ్యూస్డ్ బ్రేక్ డౌన్ స్పెక్ట్రోస్కోప్ (ఎల్ ఐబీఎస్) చంద్రుడి దక్షిణ ద్రువం వద్ద సల్ఫర్ ఉనికిని తొలిసారి గుర్తించింది. అల్యూమినియం, కాల్షియం, ఐరన్, క్రోమియం, టైటానియం, మాంగనీస్, సిలికాన్, తోపాటు, ఆక్సిజన్ ను కనుగొన్నామని, హైడ్రోజన్ కోసం పరిశోధన జరుగుతోందని కనుగొన్నట్లు ఇస్రో ప్రకటించింది.
మార్కెట్ లోకి చంద్రయాన్ రాఖీలు
ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ -3 విజయవంతం కావడంతో రాఖీలు కూడా చంద్రయాన్ -3 వచ్చాయి. ల్యాండర్, రోవర్ ఆకారాల్లో రాఖీలు అందుబాటులో ఉన్నాయి.
- Tags
- helium gas
- moon