దేశమంతా హైఅలెర్ట్
జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు చేసిన అంశంతో ఉగ్రవాదులు దేశంలో దాడులు చేసే అవకాశాలు ఉన్నట్లు ఇంటెలిజెన్స్ బ్యూరో హెచ్చరికలు జారీ చేసింది. దేశంలోని [more]
జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు చేసిన అంశంతో ఉగ్రవాదులు దేశంలో దాడులు చేసే అవకాశాలు ఉన్నట్లు ఇంటెలిజెన్స్ బ్యూరో హెచ్చరికలు జారీ చేసింది. దేశంలోని [more]
జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు చేసిన అంశంతో ఉగ్రవాదులు దేశంలో దాడులు చేసే అవకాశాలు ఉన్నట్లు ఇంటెలిజెన్స్ బ్యూరో హెచ్చరికలు జారీ చేసింది. దేశంలోని ప్రధాన విమానాశ్రయాల భద్రతను కట్టుదిట్టం చేసింది. నేటి నుండి ఆగస్ట్ 31వ తేదీ వరకు ఈ భద్రత చర్యలు చేపట్టనుంది. జమ్మూకాశ్మీర్ అంశంతో పాటు ఇతర ఇన్ ఫుట్స్ కారణంగా ఈ చర్యలు చేపట్టినట్లు కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. ఎయిర్ పోర్ట్ సందర్శకుల ప్రవేశం సైతం ఆగస్టు 10వ తేదీ నుండి 20వ తేదీ వరకు రద్దు చేశారు.
ఉగ్రదాడులు జరిగే ప్రమాదం…
జమ్మూకాశ్మీర్ అంశంపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఉగ్రవాద సంస్థలు దాడులకు పాల్పడే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. దేశంలో భారీ ప్రాణనష్టం చేసే విధంగా భారీ కుట్రలకు ఉగ్రవాదులు ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. జైషే మొహమ్మద్, లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థలు ఆత్మాహుతి దాడులకు పాల్పడే ప్రమాదం ఉందని ఐబీ హెచ్చరికలు జారీ చేసింది.
ప్రధాన విమానాశ్రయాల భద్రత కట్టుదిట్టం..
ఐబీ హెచ్చరికల నేపథ్యంలో దేశంలోని 19 ప్రధాన ఎయిర్ పోర్టులకు హై అలెర్ట్ ప్రకటించారు. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరు, ఇంఫాల్, చెన్నై, కోల్కతా, అమృత్సర్, తిరువనంతపురం, రాయ్పూర్, జైపూర్, లక్నో, శ్రీనగర్, పాట్నా, గువహతి, భోపాల్ , భువనేశ్వర్, డెహ్రాడూన్, అహ్మదాబాద్ ఎయిర్ పోర్టులకు సెక్యూరిటీ అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు.
అప్రమత్తమైన శంషాబాద్ ఎయిర్ పోర్టు అధికారులు…
ఆగస్టు 15 వ తేదీ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నేటి నుండి ఆగస్టు 20వ తేదీ వరకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో సెక్యూరిటీ అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. ఎయిర్ పోర్ట్ లోకి సందర్శకులను సైతం ఆగస్టు 20వ తేదీ వరకు అనుమతి నిరాకరించనున్నారు. ఎయిర్ పోర్ట్ లోకి వచ్చే వాహనాలను తనిఖీలు చేసిన తర్వాతే ఎయిర్ పోర్ట్ లో కి అనుమతిస్తున్నారు.