Sun Jan 12 2025 02:00:43 GMT+0000 (Coordinated Universal Time)
రేవంత్ రెడ్డి భద్రతపై హైకోర్టు కీలక ఆదేశాలు
టీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్ రెడ్డి భద్రత విషయంలో హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. తనకు ప్రాణహాని ఉందని ఇంతకుముందు రేవంత్ రెడ్డి కోర్టును ఆశ్రయించగా విచారించిన సింగిల్ బెంచ్... కేంద్ర బలగాలతో భద్రత కల్పించాలని ఆదేశాలు ఇచ్చింది. ఈ తీర్పుపై కేంద్ర హోంశాఖ అప్పీల్ కి వెళ్లగా విచారించిన డివిజన్ బెంచ్... సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది. రేవంత్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వమే 4 ప్లస్ 4 భద్రత కల్పించాలని ఆదేశాలు ఇచ్చింది.
Next Story