బ్రేకింగ్ : అచ్చెన్నాయుడు కు బిగ్ షాక్
మాజీ మంత్రి అచ్చెన్నాయుడు బెయిల్ పిటీషన్ ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టివేసింది. ఈఎస్ఐ స్కామ్ కేసులో అచ్చెన్నాయుడు గత నెల రోజుల క్రితం అరెస్ట్ అయిన సంగతి [more]
మాజీ మంత్రి అచ్చెన్నాయుడు బెయిల్ పిటీషన్ ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టివేసింది. ఈఎస్ఐ స్కామ్ కేసులో అచ్చెన్నాయుడు గత నెల రోజుల క్రితం అరెస్ట్ అయిన సంగతి [more]
మాజీ మంత్రి అచ్చెన్నాయుడు బెయిల్ పిటీషన్ ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టివేసింది. ఈఎస్ఐ స్కామ్ కేసులో అచ్చెన్నాయుడు గత నెల రోజుల క్రితం అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. అయితే అచ్చెన్నాయుడు ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అచ్చెన్నాయుడు ఆరోగ్య పరిస్థితి బాగాలేదని బెయిల్ మంజూరు చేయాలని ఆయన తరుపున న్యాయవాదులు కోరారు. అయితే ఏసీబీ తరుపున న్యాయవాది మాత్రం ఆయనకు బెయిల్ ఇస్తే సాక్ష్యాలను తారు మారు చేస్తారని వాదించింది. దీంతో అచ్చెన్నాయుడు బెయిల్ పిటీషన్ ను హైకోర్టు కొట్టివేసింది. దీంతో పాటు పితాని సత్యనారాయణ కుమారుడు మురళి, పీఏ బెయిల్ పిటీషన్లను కూడా హైకోర్టు కొట్టివేసింది.