Mon Dec 23 2024 13:59:17 GMT+0000 (Coordinated Universal Time)
ఏలూరు కార్పొరేషన్ కౌంటింగ్ కు…?
ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ కు హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఏలూరు కార్పొరేషన్ కు ఎన్నికలు జరిగినా ఫలితాలు మాత్రం వెల్లడి కాలేదు. ఏలూరు పరిధిలోని వార్డుల [more]
ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ కు హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఏలూరు కార్పొరేషన్ కు ఎన్నికలు జరిగినా ఫలితాలు మాత్రం వెల్లడి కాలేదు. ఏలూరు పరిధిలోని వార్డుల [more]
ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ కు హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఏలూరు కార్పొరేషన్ కు ఎన్నికలు జరిగినా ఫలితాలు మాత్రం వెల్లడి కాలేదు. ఏలూరు పరిధిలోని వార్డుల విభజన, ఓటర్ల జాబితాలో గందరగోళంపై కొందరు హైకోర్టును ఆశ్రయించడంతో ఫలితాలపై స్టే విధించింది. దీంతో ప్రభుత్వం డివిజన్ బెంచ్ కు అప్పీల్ కు వెళ్లింది. ఎన్నికలు నిర్వహించవచ్చని, ఫలితాలు నిలిపేయాలని గతంలో డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది. తాజాగా దీనిపై విచారణ జరిపిన హైకోర్టు కోవిడ్ నిబంధనలను పాటిస్తూ కౌంటింగ్ జరుపుకోవచ్చని తెలిపింది. దీంతో అధికారులు ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ కు ఏర్పాట్లు చేస్తున్నారు.
Next Story