సీఎంపై హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు
ఆర్టీసీ పై మరో పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది . విచారణ సందర్భంగా హైకోర్టు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 67 [more]
ఆర్టీసీ పై మరో పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది . విచారణ సందర్భంగా హైకోర్టు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 67 [more]
ఆర్టీసీ పై మరో పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది . విచారణ సందర్భంగా హైకోర్టు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 67 ప్రకారం… రోడ్డు రవాణా పై రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుందని హైకోర్టు అభిప్రాయపడింది.ఆర్టసీ, ప్రైవేటు వ్యవస్థలు సమాంతరంగా నిర్వహించే అధికారం ప్రభుత్వానికి ఉన్నప్పుడు… కేబినెట్ నిర్ణయం తప్పేలా అవుతుందో చెప్పాలని హైకోర్టు పిటిషనర్ ను ప్రశ్నించింది. ఆర్టీసీకి ఎలాంటి నష్టం జరగదని సీఎం అన్నారన్న న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వ్యాఖ్యానించారు. సీఎం ఏం అన్నారన్నది న్యాయస్థానానికి సంబంధం లేదని, కేబినెట్ నిర్ణయం చట్ట బద్ధమా…? చట్ట విరుద్ధమా…? అనేది కోర్టు ముందున్న అంశం అని హైకోర్టు వ్యాఖ్యానించింది. సెక్షన్ 102 ప్రకారం… ప్రభుత్వం అనుసరించాల్సిన ప్రక్రియ ఏంటో వివరించాలని హైకోర్టు కోరింది. చట్టం ప్రకారం ఆర్టీసీకి సమాచారాన్ని కేబినెట్ నిర్ణయం తీసుకునే ముందే ఇవ్వాలా?? తర్వాత ఇవ్వాలా..? అని హైకోర్టు ప్రశ్నించింది. విచారణ రేపటికి వాయిదా వేసింది.