Sat Nov 23 2024 18:59:21 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
ఆంధ్రప్రదేశ్ లో ఎస్సీ కమిషన్ చైర్మన్ నియామకం చెల్లదంటూ హైకోర్టులో పిటీషన్ దాఖలైంది. ఛైర్మన్ గా కారెం శివాజి ఎన్నిక చెల్లదంటూ న్యాయవాది ప్రసాద్ బాబు పిటీషన్ దాఖలు చేశారు. గతంలో కారెం శివాజి నియామకం చెల్లదని హైకోర్టు ధర్మాసనం ఆదేశాలను ఉల్లంఘించి తిరిగి నియమించడం పై కంటెమ్ట్ ఆఫ్ కోర్టు కింద పిటిషన్ వేశారు. కమిషన్ చైర్మన్ కు లా డిగ్రీ లేదని, క్రిమినల్ కేసులు ఉన్నాయని, మాల మహానాడు అనే సంఘానికి అధ్యక్షుడిగా పని చేసిన కారణంగా అన్ని కులాలకి సమన్యాయం చేయలేడని కోర్టులో పిటిషనర్ తరుపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఈ అంశంపై ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. నియామకం ప్రక్రియకు సంబంధించిన రికార్డులను సమర్పించాలని ఆదేశించింది. ఈ నెల 31న నేరుగా హాజరు కావాలని కారెం శివాజికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
Next Story