అన్నాడీఎంకే కు మరో తలనొప్పి
చెన్నై పల్లావరం సమీపంలోని ఓ హోర్డింగ్ స్కూటర్‌పై వెళ్తున్న యువతి శుభశ్రీ పై పడింది. దీంతో బలంగా గాయపడింది. వివాహ ఆహ్వానం పేరిట అన్నాడీఎంకే నేత ఒకరు [more]
చెన్నై పల్లావరం సమీపంలోని ఓ హోర్డింగ్ స్కూటర్‌పై వెళ్తున్న యువతి శుభశ్రీ పై పడింది. దీంతో బలంగా గాయపడింది. వివాహ ఆహ్వానం పేరిట అన్నాడీఎంకే నేత ఒకరు [more]
చెన్నై పల్లావరం సమీపంలోని ఓ హోర్డింగ్ స్కూటర్‌పై వెళ్తున్న యువతి శుభశ్రీ పై పడింది. దీంతో బలంగా గాయపడింది. వివాహ ఆహ్వానం పేరిట అన్నాడీఎంకే నేత ఒకరు ఏర్పాటు చేసిన ఆ హోర్డింగ్ నేలకొరిగి స్కూటర్‌పై పడడంతో అదుపు తప్పి ఆమె కింద పడింది. అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన లారీ ఆమె మీదుగా వెళ్లడంతో శుభశ్రీ మృతిచెందింది. ఆ బ్యానర్ ఏర్పాటుకు ఎటువంటి అనుమతి లేదని విచారణలో తేలింది. ఈ బ్యానర్ కారణంగా శుభశ్రీ మరణించడంతో అక్కడి ప్రజలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
ఫ్లెక్సీలపై కోర్టు ఆగ్రహం….
అక్రమ హోర్డింగులు, బ్యానర్లపై హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫ్లెక్సీ కారణంగా యువతి మృతిపై సీరియస్ అయిన హైకోర్టు తమ ఆదేశాలను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించింది. తమిళనాడులో ఏ ప్రభుత్వం ఉన్నా ఇదే నిర్లక్ష్యమా అని ప్రశ్నించింది. ఫ్లెక్సీలు లేకుండా పెళ్లిళ్లు జరగవా అని ప్రశ్నించిన న్యాయమూర్తి బీచ్ రోడ్లో ఫ్లెక్షీలను తొలగించాలని ఆదేశించారు. అధికార అన్నాడీఎంకేకు ఈ అంశం తలనొప్పిగా మారింది. సోషల్ మీడియాలో సయితం అన్నాడీఎంకేను తప్పుపడుతున్నారు నెటిజెన్లు.