ఎమ్మెల్యేల సభ్యత్వ రద్దు కేసులో హైకోర్టు సీరియస్
గత అసెంబ్లీలో సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ కుమార్ సభ్యత్వ రద్దు వ్యవహారంలో హైకోర్టు సీరియస్ అయ్యింది. వీరి సభ్యత్వ రద్దు చెల్లదని, వీరిని ఎమ్మెల్యేలుగా [more]
గత అసెంబ్లీలో సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ కుమార్ సభ్యత్వ రద్దు వ్యవహారంలో హైకోర్టు సీరియస్ అయ్యింది. వీరి సభ్యత్వ రద్దు చెల్లదని, వీరిని ఎమ్మెల్యేలుగా [more]
గత అసెంబ్లీలో సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ కుమార్ సభ్యత్వ రద్దు వ్యవహారంలో హైకోర్టు సీరియస్ అయ్యింది. వీరి సభ్యత్వ రద్దు చెల్లదని, వీరిని ఎమ్మెల్యేలుగా పరిగణించాలని కోర్టు గతంలో తీర్పు ఇచ్చింది. అయితే, ఈ తీర్పు అమలు చేయడం లేదని ఎమ్మెల్యేలు అప్పుడే కోర్టు ధిక్కరణ పిటీషన్ వేశారు. ఈ పిటీషన్ విచారణలో భాగంగా ఇవాళ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. తీర్పును అమలు చేయనందుకు గానూ కోర్టుకు వచ్చిన న్యాయశాఖ, అసెంబ్లీ కార్యదర్శులు నిరంజన్ రెడ్డి, నరసింహాచార్యులును కస్టడీలోకి తీసుకోవాల్సిందిగా రిజిస్ట్రార్ కు హైకోర్టు అసాధారణ ఆదేశాలు ఇచ్చింది. 10 వేల పూచీకత్తు సమర్పించాక వదిలేయాలని స్పష్టం చేసింది. దీంతో పాటు అప్పటి అసెంబ్లీ స్పీకర్ మధుసుదనాచారి, డీజీపీ, నల్గొండ, గద్వాల ఎస్పీలకు మరోసారి నోటీసులు జారీ చేసింది. ఇక, కోర్టును అవమానించేలా వ్యవహరించారని ప్రభుత్వ అడిషనల్ ఏజీ రామచంద్రరావుపై సైతం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తదుపరి విచారణను మార్చి 8వ తేదీకి వాయిదా వేసింది. ప్రస్తుతం ఇద్దరు ఎమ్మెల్యేలతో పాటు, స్పీకర్ కూడా ఎన్నికల్లో ఓడిపోయి మాజీలైన సంగతి తెలిసిందే.