Sun Nov 24 2024 22:51:00 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : జగన్ కు షాక్..... హైకోర్టు తుది తీర్పు
రాజధాని భూముల వ్యవహారంపై ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు హైకోర్టు షాక్ ఇచ్చింది. ప్రభుత్వానికి అటువంటి అధికారం లేదని పేర్కొంది.
రాజధాని భూముల వ్యవహారంపై ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు హైకోర్టు షాక్ ఇచ్చింది. ప్రభుత్వానికి అటువంటి అధికారం లేదని పేర్కొంది. రాజధాని భూముల పై హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం తుది తీర్పు ప్రకటించింది. సీఆర్డీఏ చట్టం ప్రకారం ప్రభుత్వం వ్యవహరించాలని పేర్కొంది. ఆరు నెలల్లో రాజధాని ప్లాన్ పూర్తి చేయాలని తెలిపింది. మూడు నెలల్లో రైతులకు రాజధానిలో ప్లాట్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ప్రభుత్వానికి శాసనాధికారం లేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. రాజధాని అవసరాలకు తప్ప వేరే వాటికి భూములు ఇవ్వవద్దని పేర్కొంది.
ఆరు నెలల్లో....
ఆరు నెలల్లో ఒప్పందం ప్రకారమే రాజధానిని అభివృద్ధి చేయాలని పేర్కొంది. రైతులకు అన్ని సౌకర్యాలతో ప్లాట్లను అభివృద్ది చేయాలని పేర్కొంది. పిటీషనర్ల ఖర్చు కోసం ఒక్కొక్కరికి యాభై వేల రూపాయలను ప్రభుత్వం చెల్లించాలని హైకోర్టు పేర్కొంది. అభివృద్ధి పనులపై ఎప్పటికప్పుడు హైకోర్టుకు నివేదిక ఇవ్వాలని పేర్కొంది. మాస్టర్ ప్లాన్ ప్రకారం రాజధాని అమరావతిని అభివృద్ధి చేయాలని పేర్కొంది.
Next Story