బాబు పోరాటానికి ఝలక్
చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు చేసిన ధర్మ పోరాట దీక్షలపై హైకోర్టు సీరియస్ అయింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఢిల్లీలో జరిగిన ధర్మ పోరాట దీక్షకు పది [more]
చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు చేసిన ధర్మ పోరాట దీక్షలపై హైకోర్టు సీరియస్ అయింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఢిల్లీలో జరిగిన ధర్మ పోరాట దీక్షకు పది [more]
చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు చేసిన ధర్మ పోరాట దీక్షలపై హైకోర్టు సీరియస్ అయింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఢిల్లీలో జరిగిన ధర్మ పోరాట దీక్షకు పది కోట్లు ప్రభుత్వ నిధులను వెచ్చించడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. ఒక్కరోజు ధర్మాకు ప్రజాధనాన్ని పది కోట్లు వెచ్చించారా? అని హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఢిల్లీలో జరిగిన ధర్మ పోరాట దీక్షపై తూర్పు గోదావరి జిల్లాకు చెందిన సూర్యనారాయణరాజు హైకోర్టు ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. కేవలం రాజకీయ లబ్ది కోసం పదికోట్ల ప్రజాధనాన్ని వెచ్చించారని పిటీషనర్ హైకోర్టుకు తెలిపారు. దీనిపై పూర్తి వివరాలను తమకు ఇవ్వాలని హైకోర్టు పేర్కొంది. కేసును వచ్చే నెల 21వ తేదీకి విచారాణను వాయిదా వేసింది.