Tue Nov 05 2024 14:40:16 GMT+0000 (Coordinated Universal Time)
రేపల్లె అత్యాచార బాధితురాలిని పరామర్శించిన హోంమంత్రి
మహిళ పట్ల జరిగిన సామూహిక అత్యాచార ఘటనలో రేపల్లె పోలీసులు స్పందించిన తీరు..నిందితులను పట్టుకున్న తీరుపై
బాపట్ల : రేపల్లె రైల్వే స్టేషన్లో ఏప్రిల్ 30 వ తేదీ అర్థరాత్రి 1 గంట సమయంలో మహిళపై ముగ్గురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడిన ఘటనలో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఇప్పటికే ఈ కేసులో నిందితులుగా గుర్తిస్తూ.. ముగ్గురిని అరెస్ట్ చేశారు. కాగా.. సోమవారం ఏపీ హోంమంత్రి తానేటి వనిత ఒంగోలు రిమ్స్ లో చికిత్స పొందుతోన్న బాధితురాలిని పరామర్శించారు.
అనంతరం హోంమంత్రి మీడియాతో మాట్లాడారు. రేపల్లె రైల్వేస్టేషన్లో బాధిరాలిపై జరిగిన ఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. రైల్వేస్టేషన్లో ఉన్న బాధిత మహిళ భర్తను..టైం ఎంతైందని అడిగి నిందితులు ఈ ఘోరానికి పాల్పడ్డారని ఆమె తెలిపారు. భార్యను కాపాడుకునేందుకు భర్త ఇతరుల సహాయం కోరినా ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. అర్ధరాత్రి సమయంలో రైల్వే పోలీసులను ఆశ్రయించినా వారు స్పందించలేదని..దీంతో బాధితుడు సమీపంలో ఉన్న సివిల్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసినట్లు హోంమంత్రి తెలిపారు. పోలీసు వాహనాల సైరన్ శబ్దాలు విని నిందితులు పరారవ్వగా.. స్థానికుల ద్వారా నేతాజీ కాలనీలో వారిని గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.
మహిళ పట్ల జరిగిన సామూహిక అత్యాచార ఘటనలో రేపల్లె పోలీసులు స్పందించిన తీరు.. నిందితులను పట్టుకున్న తీరుపై సిబ్బందిని హోంమంత్రి తానేటి వనిత అభినందించారు. నిందితులపై అట్రాసిటీ, హత్యాయత్నం, దోపిడీ వంటి సెక్షన్స్ కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మంత్రి వివరించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భాదితురాలి మానసిక పరిస్థితి సరిగాలేదన్న ఆమె.. రాష్ట్ర ప్రభుత్వం తరుపున బాధితురాలి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించినట్లు వెల్లడించారు.
Next Story